రానా, మిహీకా రోకా ఫంక్షన్ లో సామ్, చైతు సందడి..!

513
Samantha Teases Her Husband On Instagram
Samantha Teases Her Husband On Instagram

‘ఏమాయ చేసావే’ సినిమాలో కలిసి నటించిన చెయ్ – సామ్.. ఆ తర్వాత ఒకర్ని ఒకరు అర్దం చేసుకుని ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దాంతో సమంత అక్కినేని కోడలు అయింది. సమంత వివాహం తర్వాత కూడా కెరీర్ ను నిర్లక్ష్యం చేయకుండా వరుసగా సినిమాలు చేస్తోంది. వైవాహిక జీవితాన్ని సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత.. భర్త నాగ చైతన్య తో తన అనుబంధాన్ని ఎప్పటికప్పుడు దాచుకోకుండా సందర్భం వచ్చినప్పుడు సోషల్ మీడియా వేదికగా చెబుతూనే ఉంటుంది.

సామాజిక అంశాలపై స్పందించడమే కాకుండా.. అప్పుడప్పుడూ తన భర్త నాగచైతన్యను ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు కూడా చేస్తారు. ఇక ఇటీవలే రానా – మిహికా బజాజ్ ల రోకా ఫంక్షన్ లో నాగచైతన్య – సమంత దంపతులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను సమంత తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ముందుగా రానా – మిహీకా దంపతులతో దగ్గుబాటి ఫ్యామిలీ మరియు చెయ్ – సామ్ కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ”2020లో ఒక మంచి శుభవార్త చెప్పినందుకు రానా – మిహీకాలకు థ్యాంక్స్” అని పోస్ట్ చేసారు. ఆ తర్వాత భర్త నాగచైతన్య ఫొటో షేర్ చేసిన సమంత.. ఆయనను ఆటపట్టించేలా ఫన్నీగా కామెంట్ చేశారు. ”అమ్మ – ఆంటీ – బంధువులు – స్నేహితులు అందరిని పంపించిన తర్వాత ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ సమయం వచ్చింది.

చూడండి నా భర్త ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో కదా..?? (నా భర్త ఎక్కడో ఒక్క పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు)” అని క్యాప్షన్ లో పేర్కొన్నారు సమంత. అయితే ఈ ఫోటోలో చైతు నిజంగానే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఫార్మల్ డ్రెస్ లో నీట్ గా టక్ చేసి లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు. చైతు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా దీనీపై స్పందించిన చైతూ సరదగా రిప్లయ్ ఇచ్చాడు. ”ఓకే నౌ.. చూస్తుంటే ఇది ఇతరుల పార్టనర్ షిప్ తో చేసిన పెయిడ్ పోస్ట్ లలో ఒకటిగా కనిపిస్తుంది” అని కామెంట్ చేసారు. వీరి సరదా సంభాషన్ చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Loading...