టీజర్ తోనే నవ్విస్తున్న సందీప్ కిషన్

213
Sandeep Kishan's Tenali Ramakrishna BA.BL Teaser Review
Sandeep Kishan's Tenali Ramakrishna BA.BL Teaser Review

వరుస డిజాస్టర్లతో సతమతమయిన యువ హీరో సందీప్ కిషన్ ఈమధ్య ‘నిను వీడని నీడను నేనే’ అనే సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. తాజాగా ఇప్పుడు ‘తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్’ అనే ఒక కామెడీ సినిమాతో మళ్లీ మన ముందుకు రాబోతున్నాడు సందీప్.

జి.నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. హన్సిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, మురళి శర్మ, మరియు పృథ్వీరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు తోనే ఆసక్తి పెంచిన దర్శకనిర్మాతలు తాజాగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు.

ఈ వీడియో సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది అని చెప్పొచ్చు. టైటిల్ కి తగ్గట్టుగానే లాయర్ పాత్రలో సందీప్ సినిమాలో నవ్వుల పూవులు పూయించనున్నాడు. అయితే కేవలం కామెడీ మాత్రమే కాక సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని టీజర్ చూస్తే తెలుస్తోంది.

అగ్రహారం నాగిరెడ్డి మరియు సంజీవరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి శేఖర్చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. కె శ్యామ్ నాయుడు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Loading...