గోపీచంద్ ని చూసి పెద్ద హీరోలు నేర్చుకోవాలి!

329
SaveNallamala: Hero Gopichand Says We Need to Protect the Trees
SaveNallamala: Hero Gopichand Says We Need to Protect the Trees

నల్లమల అడవులని కాపాడాలి అనే ఉదేశ్యం తో ఇప్పటికే సోషల్ మీడియా లో చాలా మంది పోస్ట్స్ వేస్తూ ఉన్నారు. ఈ విషయం పై అవగాహన తీసుకొని వచ్చే వారి సంఖ్యా కూడా అంతకంతకూ పెరుగుతూ వస్తుంది. అయితే ఈ విషయం పక్కన పెడితే మన తెలుగు సినిమా పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ మరియు విజయ్ దేవరకొండ మినహా పెద్ద హీరోలు ఎవరూ ఇంకా స్పందించలేదు.

అయితే ఈ పెద్ద హీరోలు కూడా స్పందిస్తే బాగుంటుంది అని కొందరి వాదన. పక్కన రాష్ట్రం లో జల్లికట్టు గురించి, ఏమజాన్ ఫారెస్ట్ గురించి స్పందించిన మహేష్ వంటి హీరోలు మన నల్లమల గురించి ఎందుకు మౌనం గా ఉన్నారు అనేది ప్రశ్న.

ఈ నేపథ్యం లో గోపీచంద్ నల్లమల అడవులని సంరక్షించుకోవాలి అని పిలుపు ని ఇచ్చారు. తన కొత్త సినిమా చాణక్య ప్రమోషన్స్ లో ఆయన పాల్గొంటూ మన అడవులని కాపాడుకొనే బాధ్యత మన పైన ఎంతైనా ఉంది అని ఆయన కొనియాడారు. అయితే గోపీచంద్ కి అవకాశం వచ్చింది, ఆయన స్పందించారు. ఇలాగే మిగిలిన వాళ్ళు కూడా ఈయనని చూసి నేర్చుకోవాలని, చిరంజీవి, వెంకటేష్ వంటి హీరోలు కూడా ముందుకు రావాలని అందరూ అంటున్నారు!

Loading...