ప్ర‌ముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత..

124
Senior actress and filmmaker Vijaya Nirmala passes away
Senior actress and filmmaker Vijaya Nirmala passes away

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి, దర్శకురాలు..సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల (73) ఈ రోజు ఉదయం కన్నుమూసారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు.

సీనియర్ నటి, దర్శకురాలు మృతిపై టాలీవుడ్ సంతాపం వ్యక్తం చేసింది. ఆమె తెలుగు సినిమాలో ప్రధానంగా చేసిన రచనలకు ప్రసిద్ది చెందింది. విజయ నిర్మల తెలుగులో 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2002 లో, ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అత్యధిక చిత్రాలకు మహిళా దర్శకురాలిగా పేరు నమోదు చేసి రికార్డు సృష్టించింది.

విజయ నిర్మల తండ్రిది చెన్నై. తల్లిది మాత్రం గుంటూరు జిల్లా నరసరావు పేట. తన మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తర్వాత ఆమె కృష్ణని రెండో వివాహం చేసుకున్నారు. ప్రముఖ నటుడు నరేష్ విజయ నిర్మల కొడుకు. ఆమె మొదటి భర్త వలన కలిగిన సంతానం. అప్పటికే కృష్ణ, విజయ నిర్మలకు విడి విడిగా సంతానం ఉండటం చేత వీళ్లిద్దరు మాత్రం సంతానం వద్దనుకున్నారు.