Friday, April 26, 2024
- Advertisement -

హీరో కి గాయం, నిర్మాతలకి నష్టం

- Advertisement -

యువ హీరో శర్వానంద్ కి సడన్ గా గాయం అవడం తో అందరూ ఒక్క సారిగా కంగారు పడ్డారు. అయితే ఇప్పటి వరకు గాయాలు తగిలించుకున్న హీరోలు అందరిలో శర్వానంద్ కి అయినా గాయమే పెద్దది అని సమాచారం. 96 రీమేక్ కి సంబంధించి పారా గ్లైడింగ్ క్లాసెస్ లో కోర్స్ తీసుకుంటూ ఉండగా శర్వా కి గాయం అయింది. అయితే భుజానికి, కాలికి బలమైన గాయాలు కావడం తో శర్వానంద్ కి ఈ రోజు శస్త్ర చికిత్స చేయనున్నారు. డాక్టర్లు చెప్పే దాని ప్రకారం ఈ శస్త్ర చికిత్స చేసిన అనంతరం శర్వానంద్ దాదాపు మూడు నెలలు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలట. మూడో నెలల వరకు షూటింగ్ లో పాల్గొనడం కుదరదు అని కూడా హెచ్చరించారు అని తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం ఫిలిం నగర్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం శర్వా కి అయినా ఈ గాయం వలన ఒకరిద్దరు నిర్మాతలు నష్టపోనున్నారు. ముఖ్యంగా శర్వా ఇప్పుడు నటిస్తున్న 96 రీమేక్ షూటింగ్ మరో రెండు నెలలు వాయిదా పడనుంది. అలాగే శర్వా ఒక రెండు కొత్త సినిమాలు మొదలుపెట్టి త్వరలో షూటింగ్ ముగించాలి అనే ఉదేశ్యం తో ఉన్నాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా వాయిదా పడనున్నాయి.

లక్కీ గా శర్వానంద్ రణరంగం సినిమా ని పూర్తి చేయడం తో ఈ సినిమా విడుదల కి సిద్ధం గా ఉంది, లేకపోతే అది కూడా లేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -