Saturday, May 11, 2024
- Advertisement -

శర్వానంద్ కొందరికి క్రిమినల్.. కొందరికి హీరో…

- Advertisement -

‘మహానుభావుడు’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నప్పటికి యువ హీరో శర్వానంద్ ‘పడి పడి లేచే మనసు’ సినిమాతో మాత్రం పెద్దగా మెప్పించలేకపోయాడు. తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘రణరంగం’ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్స్టర్ అవతారంలో కనిపించబోతున్నాడట. ఇవాళే విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తే అది నిజమని తెలుస్తోంది. గుబురు గడ్డంతో నిజంగానే ఒక గ్యాంగ్స్టర్ లాగా కనిపిస్తుంది.

ఇంతకు ముందు సినిమాలకు లో తను పోషించిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో ఒక స్టైలిష్ మరియు మాస్ రోల్ చేయబోతున్నాడు శర్వానంద్. టీజర్ ఏ ఇలా ఉంటే సినిమా ఎలా ఉండబోతోందో అని ప్రేక్షకులు ఇప్పటి నుండే ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. కాజల్ అగర్వాల్ మరియు ‘చిత్రలహరి’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ పిళ్ళై సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -