Friday, April 26, 2024
- Advertisement -

శృతి ప్రయత్నాలు అన్నీ విఫలం

- Advertisement -

శృతి హాసన్ ప్రస్తుతం తెలుగు సినిమా లో ఒక మంచి ప్రాజెక్ట్ తో కంబాక్ ఇవ్వాలనే ఆలోచన తో ఉంది. అయితే ఈ భామ మొదటి నుంచి తెలుగు కి తమిళం కి సరైన ప్రాముఖ్యత ఇస్తూ వచ్చినా కాటంరాయుడు సినిమా తర్వాత శృతి సినిమాలు మానేసి లండన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చిన హీరోయిన్ సినిమాలు మళ్ళీ ఒకప్పటి లా చకచకా చేయాలనే ఉదేశ్యం తో ఉంది. అయితే తమిళం లో ఆరా కొరా అవకాశాలు వస్తున్నప్పటికీ, శృతి హాసన్ మాత్రం తెలుగు మీద ధ్యాస పెడుతుంది. తెలుగు లో ఒక పెద్ద సినిమా చేసినా తిరిగి ఫామ్ లో కి వచ్చినట్టే.

కాకపోతే ఇటీవలే శృతి తెలుగు లో తనకి మంచి పరిచయం ఉన్న హీరోలని, దర్శకులని, నిర్మాతలని కలిసింది. అందులో భాగంగా అల్లు అర్జున్ సరసన అవకాశం కోసం చూడగా, అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాల్లో అసలు శృతి ని కన్సిడర్ చేయలేదు. ఇక రవితేజ ని కూడా కలవగా రవి నుంచి కూడా ఆశించిన రేంజ్ లో స్పందన లేదట. ఇదంతా కాదు అని కొంత మంది నిర్మాతల దగ్గరకి వెళ్లగా, శృతి డిమాండ్ చేసిన పారితోషికం ఇచ్చే స్థితి లో వాళ్ళు లేరట. కొరటాల శివ మీద శృతి ఆశలు పెట్టుకుంది కానీ ఇప్పుడు చిరంజీవి సినిమా లో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ అని టాక్ నడుస్తుంది.

ఇలా ఒక దాని తర్వాత ఒకటి శృతి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ వృధా అయిపోవడం బాధాకరం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -