మోసం చేశాడు.. వాడి పళ్లు రాలగొడుతా : సింగర్ సునీత ఫైర్

1440
Singer Sunitha Fires On Fake Person Which He Used Her Name For Frauds
Singer Sunitha Fires On Fake Person Which He Used Her Name For Frauds

సినిమా ప్రపంచం అంటే అందరికి ఇష్టమే. సినిమాలపై మోజు అందరికి ఉంటుంది. కొందరు సినిమాల్లో నటించాలని కొందరు సినిమాలకు పని చేయాలని ఆశపడుతారు. సినిమాల్లో ఒక్క ఛాన్స్ అయినా రాకపోతుందా అని ఎదురుచూసేవారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటివారిని క్యాష్ చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఆఫర్ ఇప్పిస్తానని నమ్మించి.. మాకు పెద్ద పెద్దవాళ్ళు తెలుసు అని బురిడీ కొట్టించి సొమ్ము కాజేస్తున్నారు.

ఇలాంటివి ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే విషయమై ఇటీవలే కొందరు సెలబ్రిటీలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికి ఈ మోసగాళ్ల మాయలు ఆగడం లేదు. తాజాగా సింగర్ సునీత మేనల్లుడిని అని చెప్పుకుంటూ చైతన్య అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతుండటం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియా స్పందించిన సునీత.. తనకు మేనల్లుడు ఎవరూ లేరని, దయచేసి అలాంటి వారిని నమ్మకండి అంటూ ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ..”చైతన్య అనే అనంతపురంకు చెందిన వ్యక్తి నా మేనల్లుడు అని చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్నాడని తెలిసింది. చైతన్య అనే వాడెవడో కూడా నాకు తెలియదు. వాడి మాటలు నమ్మి మోసపోకండి. ఎవ్వరూ మోసపోకూడదనే ఇలా వీడియో ద్వారా క్లారిటీ ఇస్తున్నా. ఇకనైనా బయటి వ్యక్తులు ఎవరైనా ఇలాంటి మాటలు చెబితే జాగ్రత్తగా ఉండండి. దయచేసి డబ్బులు పోగోట్టుకోవద్దు. ఆ చైతన్య అనే వ్యక్తి ఎవడో నాకు తెలియదు. వాడు కనిపిస్తే పళ్ళు రాలిపోతాయ్! పోలీస్ కంప్లైంట్ చేస్తా.. వాడిని వదలను’’ అని సునీత ఫైర్ అయింది.

‘మర్డర్’ ట్రైలర్.. కళ్ళ కట్టినట్టు చూపించిన వర్మ..!

నితిన్ పెళ్లి కానుకగా ‘రంగ్ దే’ దృశ్య మాలిక

ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ లో నితిన్, శాలిని సందడి..!

‘పవర్ స్టార్’ మూవీ రివ్యూ

Loading...