ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమాను తిరస్క‌రించిన సీనియ‌ర్ హీరోయిన్..

357
Tollywood siner heroin laya rejected ntr, trivikram movie
Tollywood siner heroin laya rejected ntr, trivikram movie

ఒకప్పటి హీరోయిన్లను క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చూపుతూ, వారికి ప్రాధాన్యతతో కూడిన పాత్రలను ఇస్తూ వస్తున్నాడు దర్శకరచయిత త్రివిక్రమ్. ప్రత్యేకించి ‘అత్తారింటికి దారేదీ’ లో నదియాకు ఏకంగా టైటిల్ రోల్ ఇచ్చాడు. ఇక ఇటీవల పవన్ కల్యాణ్ సినిమా ‘అజ్ఞాత‌వాసి’తో ఖుష్బూకు ప్రాధాన్యత ఉన్న పాత్రను ఇచ్చాడు. హీరోకి పిన్ని పాత్రను ఆమెకు ఇచ్చాడు ఈ దర్శకుడు.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెలాఖ‌రు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. తార‌క్‌, త్రివిక్ర‌మ్ సినిమాలోనూ ఇలా ఓ సీనియ‌ర్ హీరోయిన్ కు స్థానం ద‌క్కింద‌ని వార్తలు వచ్చాయి. ఆ మాజీ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు.. ల‌య‌.

‘స్వ‌యంవ‌రం’, ‘ప్రేమించు’ త‌దిత‌ర చిత్రాల‌తో పాపుల‌ర్ అయిన‌ ఈ అచ్చ తెలుగ‌మ్మాయి.. వివాహం త‌రువాత సినిమాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆమెను ఈ సినిమా కోసం ఎప్రోచ్ అయ్యారని, అయితే ఆమె రిజెక్ట్ చేసిందని సమాచారం. తన కుటుంబ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని, తిరిగి యాక్టింగ్ అంటూ వెనక్కి వచ్చే ఇంట్రస్ట్ లేదని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

అత్తారింటికి దారేది’ నుంచి త‌న ప్ర‌తి సినిమాలోనూ ఓ సీనియ‌ర్ న‌టికి త‌గ్గ పాత్ర‌ని క‌ల్పిస్తున్న త్రివిక్ర‌మ్‌.. ఈ చిత్రంలోనూ అలాంటి పాత్ర‌ని డిజైన్ చేశాడ‌ని తెలిసింది. ఆ పాత్ర కోసం ముగ్గురి పేర్ల‌ను ప‌రిశీలించారని తెలిసింది. మీనా, సిమ్ర‌న్‌, ల‌య‌. ఇలా ఈ ముగ్గురిలో ల‌య తిర‌స్క‌రించింది కాబ‌ట్టి మీనా, సిమ్రాన్‌ల‌లో ఒవ‌రికో ఒక‌రికి క్యారెక్ట‌ర్ ద‌క్క‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Loading...