Friday, April 26, 2024
- Advertisement -

కూతురుకి సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసిన వెంక‌టేశ్‌

- Advertisement -

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్ ఇంట్లో పెళ్లి సంద‌డి మొద‌లైంది. వెంకీ పెద్ద కూతురు ఆశ్రిత పెళ్లి గురించి గ‌త కొంత‌కాలంగా మీడియాలో ర‌కర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు వెంకీ. తాజాగా ఆశ్రిత పెళ్లి గురించి ఓ వార్త ఆఫిషియ‌ల్‌గా బ‌య‌టికి వ‌చ్చింది. వెంకటేష్ కుమార్తె ఆశ్రితకు హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్. సురేందర్ రెడ్డిగారి మనవడికి త్వరలో వివాహం జ‌ర‌గ‌నుంది.ఇటీవ‌లే వీరి నిశ్చితార్థం సైలెంట్‌గా జ‌రిగిపోయింద‌ట‌. ఈ నిశ్చితార్థానికి కొంద‌రు కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది.ఈ ఫంక్షన్ కు సంబంధించి ఒక్కఫోటో కూడా బయటకు రాలేదంటే ఎంత ప్రైవేట్ గా కార్యక్రమాన్ని నిర్వహించారో అర్థం చేసుకోవాలి. అయితే వీరి పెళ్లి కూడా మ‌రోవారంలోనే జ‌ర‌గునంద‌ని స‌మాచారం.

రాజస్థాన్ లో జరగనున్న ఈ పెళ్ళికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు,అత్యంత సన్నిహితుల‌ను మాత్ర‌మే పిలిచార‌ట‌. ద‌గ్గుబాటి ఇంట్లో పెళ్లి అంటే రానా,నాగ చైతన్య,సమంత, అఖిల్ సందడి ఉండ‌నే ఉంటుంది. మ‌రి వాళ్లు అయిన ఈ పెళ్లి గురించి తమ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డిస్తారేమో అని అభిమానులు అతృతుగా ఎదురుచూస్తున్నారు. అస‌లు త‌న కూతురు వివాహాన్ని ఇంత సైలెంట్‌గా ఎందుకు చేస్తున్నాడో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఇదిలా ఉంటే దగ్గుబాటి ఫ్యామిలీ రిసెప్షన్ ను మాత్రం భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ఈ రిసెప్షన్ కు మాత్రం ఫిలిం ఇండస్ట్రీకి చెందినవారు ఇతర ముఖ్యులు హాజరవుతారని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -