Saturday, April 27, 2024
- Advertisement -

మెగా హీరోయిన్ కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

- Advertisement -

మెగా హీరోయిన్ నిహారిక ఇండ‌స్ట్రీకి వ‌చ్చి చాలాకాలం అయినప్ప‌టి ఇప్ప‌టి వ‌ర‌కు హిట్ మాత్ర కొట్ట‌లేక‌పోయింది. తెలుగు , త‌మిళ భాష‌ల‌లో సినిమాలు చేసిన‌ప్ప‌టికి హిట్ మాత్రం దక్క‌లేదు. నిహారిక ఇటీవ‌ల న‌టించిన ‘హ్యాపీ వెడ్డింగ్‌’ ఆమెకు మ‌రో హిట్‌ను ఇవ్వ‌లేక‌పోయింది. నిహారిక తాజాగా న‌టించిన చిత్రం ‘సూర్యకాంతం’. ఈ సినిమాలో హీరోగా రాహుల్‌ విజయ్ న‌టిస్తున్నాడు. నిహారిక అన్న‌య్య, హీరో వ‌రుణ్ తేజ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక శ‌నివారం ఘ‌నంగా జ‌రిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు టాలీవుడ్ స‌న్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ముఖ్య అతిథిగా వ‌చ్చారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ గెస్ట్‌గా రావ‌డంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మ‌రింత పండుగ వాత‌వార‌ణం తోడైన‌ట్లుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ సూర్యకాంతం సినిమా గురించి మాట్లుడుతు నిహారిక గురించి చెప్పేంత సీన్ త‌న‌కు లేద‌ని, నిహారిక కిల్లింగ్ యాక్టింగ్ చేస్తుంద‌ని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఖచ్చితంగా ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని తెలిపాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు మార్క్‌ కె రాబిన్‌ సంగీతం అందించారు. మార్చి 29న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -