Saturday, April 27, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ సినిమా కి మోక్షం ఎప్పుడు?

- Advertisement -

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో త్వరలో రానున్న చిత్రం డియర్ కామ్రేడ్. ఈ సినిమా తో భరత్ కమ్మ దర్శకుడి గా పరిచయం కానున్నాడు. ఈయన ఇంతకు ముందు చంద్ర శేఖర్ యేలేటి దగ్గర సహాయ దర్శకుడి గా పని చేశారు. నిజానికి ఈ సినిమా మే 31 న విడుదల కావాల్సి ఉంది అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా విడుదల జులై కి వాయిదా పడింది. జులై లో 26 న ఈ సినిమా ని విడుదల చేయాలి అని భావించారు దర్శక నిర్మాతలు కానీ ఎందుకో ఇప్పుడు అది కుదిరే లా అనిపించట్లేదు.

సినిమా యూనిట్ కష్టపడి షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల తో తీరిక లేకుండా ఉన్నా, కొన్ని సీన్ల విషయం లో దర్శకుడు అసంతృప్తి గా ఉన్నాడట. ఈ సీన్లని మళ్ళి షూట్ చేయాలనే భావన లో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ షూటింగ్ మళ్ళి మొదలు అయితే, అందరి డేట్లు పట్టుకొని షూట్ చేసి తిరిగి ఎడిట్ చేయాలంటే సమయం పడుతుంది. అప్పుడు మళ్లీ సినిమా వాయిదా ఆయె అవకాశం ఉంది.

మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తం గా ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -