బాల‌య్య‌తో జోడి క‌ట్ట‌డానికి ఎగ‌బ‌డుత‌న్న కుర్ర హీరోయిన్లు

462
Young heroines competing to pair with Balayya
Young heroines competing to pair with Balayya

నందమూరి బాలకృష్ణ వయసు ఆరు పదులు దాటినా కానీ యవ్వనుడి లా ఇంకా సినిమాల్లో పాటలు, ఫైట్లు తో పాటు రొమాన్స్ కూడా చేస్తున్నాడు. తన ప్రతి సినిమా లో తన వయసు కి తగ్గ పాత్ర కాకుండా కుర్ర హీరో పాత్ర పోషిస్తూ మాస్ ఆడియన్స్ ని అలరిస్తూ ఉన్నాడు. అయితే క్రమక్రమం గా ఆడియన్స్ అభిరుచుల్లో మార్పులు వస్తూ ఉండటం తో బాలకృష్ణ కూడా కాస్త పంథా మార్చాల్సిన స్థితి వచ్చింది. కానీ బాలయ్య మాత్రం తన దారి తనదే అన్నట్టు కుర్ర హీరోయిన్లని సినిమా లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

మొన్న మొన్న టి వరకు ఆయన తదుపరి సినిమా లో పాయల్ రాజపుట్ లేదా శ్రియ నటిస్తారు అనే వార్తలు వచ్చాయి కానీ నేడు మళ్ళీ సోనాల్ చౌహన్ ఈ సినిమా లో నటిస్తుంది అనే ప్రచారం సాగుతుంది. అయితే సోనాల్ లాంటి హాట్ బ్యూటీస్ నిజానికి బాలకృష్ణ పక్కన చేయడానికి ఒకే ఒక కారణం పారితోషికం. వాళ్లకి ఈ సినిమాల్లో పాత్ర ఏమి ఉండదు కానీ పారితోషికం బాగా ఇస్తారు అని సీనియర్ హీరోల తో ఆడి పాడతారు. వాళ్ళ కెమిస్ట్రీ కూడా అంత గొప్పగా ఏమి ఉండదు.

ఈ విషయం గ్రహించి బాలయ్య తన వయసు వాళ్ళతో జత కడితే బాగుంటుంది అనే అభిప్రాయం చాలా మంది లో ఉంది. కానీ అది బాలయ్య ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో.

Loading...