ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి స‌ర్వేపై నిప్పులు చెరిగిన మంత్రి..

1545
AP Minister Ayyanna Patrudu Shocking Comments on Lagadapati Exit poll Survey
AP Minister Ayyanna Patrudu Shocking Comments on Lagadapati Exit poll Survey

ఏపీ ప్రజలు టీడీపీకి మళ్లీ పట్టం కడతారన్న లగడపాటి రాజగోపాల్ సర్వేతో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. జాతీయ స‌ర్వేల‌ను లెక్క‌లోకి తీసుకోకుండా ఒక్క ల‌గ‌డ‌పాటి స‌ర్వేను మాత్ర‌మే న‌మ్ముతున్నారు. ఇద‌లా ఉంటె ల‌గ‌డ‌పాటి స‌ర్వేపై ఓమంత్రి నిప్పులు చెరిగారు.

తెలుగుదేశంపార్టీనే గెలుస్తుందని లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో చెప్పినా దాన్ని బోగస్ గా మంత్రి అయ్య‌న్న పాత్రుడు కొట్టి పారేశారు. ఎక్కడో కూర్చుని కొందరితో మాట్లాడేసి సర్వే అంటే ఎలాగంటూ మండిపడ్డారు.లగడపాటి సర్వేలన్నీ కేవలం బెట్టింగ్ రాయళ్ళ కోసమే అని కూడా మంత్రి తేల్చిపారేశారు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ కారణంగా పందేలు కాసిన వాళ్లు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని విమర్శించారు. లగడపాటి మాట నమ్మేసి సర్వనాశనం అయిపోయామని ఇటీవలే హైదరాబాద్ లో పెళ్లికి వెళితే అక్కడికి వచ్చిన వాళ్లలో కొంతమంది తనకు చెప్పారని అన్నారు.

జాతీయ మీడియా సంస్ధల్లో దాదాపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాయని తేల్చేశాయి. కాని బాబునుంచి టీడీపీ నేత‌లంద‌రూ ఆస‌ర్వేల‌ను కొట్టి పారేస్తున్నారు. జాతీయ మీడియా చేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేని కాదని లగడపాటి విడుదల చేసిన సర్వేనే ప్రమాణికమన్నట్లుగా టిడిపి నేతలు మాట్లాడుతున్నారు. ఎటువంటి శాస్త్రీయత లేకుండా లగడపాటి చేసిన సర్వేని నమ్ముకోవద్దంటూ చింతకాయల హెచ్చరించటం గమనార్హం.

నిజానికి ఆదివారం లగడపాటి విడుదల చేసిన సర్వే వివరాలు రాత్రికే బోగస్ అని తేలిపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు రుణం తీర్చుకోవటానికి, తమ్ముళ్ళల్లో కాస్త ఆత్మస్ధైర్యం నింపటానికే లగడపాటి సర్వే పనికొస్తుందని టిడిపిలోనే కొత్త చర్చ జరుగుతోంది. తాజాగా అయ‌న్న‌పాత్రుడు చేసిన వ్యాఖ్య‌లు తెలుగు త‌మ్ముళ్ల‌లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Loading...