Saturday, April 27, 2024
- Advertisement -

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఏం సాధించాడు ?: గంభీర్

- Advertisement -

టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఏం సాధించాడని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు. 2017లో ధోనీ నుంచి కెఫ్టెన్సీ బాధ్యతలు తీసుకున్న కోహ్లీ.. ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్ కి వచ్చిన టీమిండియా.. అక్కడ పాక్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లోనే ఇంటికి వచ్చేసింది. దాంతో కోహ్లీ సాధించింది ఏముందని గంభీర్ ఎద్దేవా చేశాడు. కోహ్లీకి బ్యాట్స్ మెన్ గా తిరుగులేదు.

కానీ కెఫ్టెన్ గా జట్టుని విజేతగా నిలపలేకపోతున్నాడు. “వ్యక్తిగతంగా ఎన్ని పరుగులైనా చేయొచ్చు. కానీ కెఫ్టెన్ గా విజయాల సంగతి ఏంటి ? బ్రయాన్ లారా, జాక్వెస్ కలిసి తాము క్రికెట్ ఆడే రోజుల్లో పరుగుల వరద పారించారు. ఇప్పుడు కోహ్లీ కూడా ఆ తరహాలో పరుగులు చేస్తున్నాడు. కానీ ఐసీసీ ట్రోఫీలు గెలవకపోతే సదరు ఆటగాడి కెరీర్ అసంపూర్తిగా ఉండిపోతుంది. నిజాయతీగా చెప్పాలంటే కెప్టెన్‌గా ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎన్నో సాధించొచ్చు’’ అని గంభీర్ వెల్లడించాడు.

ఇక కోహ్లీ కంటే ముందు కెఫ్టెన్ గా ఉన్న ధోనీ.. 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్‌కి అందించాడు. క్రికెట్ ప్రపంచంలో ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ ధోనీనే కావడం విశేషం. ఐపీఎల్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని ధోనీ మూడు సార్లు టైటిల్ విజేతగా నిలపగా.. గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు సార్లు విజేతగా నిలిచింది. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు.

తండ్రి కాబోతున్న హార్దిక్ పాండ్యా.. పెళ్లి ఎప్పుడు అయింది ?

ధోనీ రిటైర్మెంట్ గురించి రైనా ఏమన్నాడంటే ?

ఐపీఎల్ 2020 విజేత ఎవరో చెప్పి చెన్నైకి షాక్ ఇచ్చిన శ్రీశాంత్

ఐపీఎల్ లో రోహిత్ కెఫ్టెన్ గా సక్సెస్ కు కారణం చెప్పిన లక్ష్మణ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -