Saturday, April 27, 2024
- Advertisement -

నా జోలికి వచ్చే ముందు మీ అమ్మ, చెల్లిని గుర్తు చేసుకో : కస్తూరి

- Advertisement -

సెలబ్రిటీలపై కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తుంటారు. కొందరు వారిని దృష్టిని ఆకర్షించేందుకు అయితే మరికొందరు వారిని మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు కామెంట్స్ చేస్తుంటారు. ప్రతి ఒక్క సెలబ్రిటీ బ్యాడ్ కామెంట్స్ ను ఎదుర్కుంటూనే ఉన్నారు. అయితే కొందరు సెలబ్రిటీలు ఆ కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోరు.

కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం ఆ కామెంట్స్ పై సీరియస్ గా స్పందిస్తారు. తాజాగా సీనియర్ నటి కస్తూరి తనపై ఒక వ్యక్తి చేసిన బ్యాడ్ కామెంట్స్ కు స్పందించింది. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈమెను కొన్ని రోజుల క్రితం అజిత్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. తమ అభిమాన హీరోను అవమానించేలా మాట్లాడావు అంటూ కొన్ని రోజులుగా కస్తూరిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

వారి బ్యాడ్ కామెంట్స్ పై ఎప్పటికప్పుడు కస్తూరి స్పందిస్తూనే ఉంది. తాజాగా నాపై బ్యాడ్ కామెంట్లు పెట్టే వారు ముందు వారి తల్లిని, చెల్లిని గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది అని సలహా ఇచ్చింది. ఈ పోస్ట్ కు కూడా నెటిజన్స్ తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమెను మరోసారి టార్గెట్ చేసి నీవు చేసేలా మా అమ్మ చెల్లి ప్రవర్తించడం లేదు.. నీకు వారితో పోలిక ఏంటీ అంటూ మరింతగా రెచ్చి పోతున్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ ను పట్టించుకోకుండా ఉంటే బేటర్ అని ఈ సీనియర్ నటికి కొందరు సలహా ఇస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -