వరుణ్ సందేశ్ బెడ్ రూం గురించి రవి.. ఏమన్నాడంటే ?

6259
Anchor Ravi interview with Bigg Boss 3 Team
Anchor Ravi interview with Bigg Boss 3 Team

తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ ముగిసి మూడు వారాలు అయింది. ఇంటీ సభ్యులందరు పార్టీలు చేసుకుంటున్నారు. అలానే ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఈ సీజన్ లో వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అయితే ఇటీవలే యాంకర్ రవి ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో ఈ నలుగురు పాల్గొన్నారు. ఇందులో భాగంగా వారిని రవి రకరకల ప్రశ్నలు అడిగాడు. ఇంటర్వ్యూలో భాగంగా.. వరుణ్ సందేశ్ ను ఇబ్బింది పెట్టే అసభ్యకరమైన ప్రశ్నలు అడిగాడు యాంకర్ రవి.

ఇంటర్వ్యూలో బిగ్ బాస్ అవతారమెత్తిన రవి ఎవ్వరికీ కనిపించకుండా తన వాయిస్ వినిపిస్తూ మాట్లాడాడు. ’బిగ్ బాస్’ టాస్క్ ల మాదిరి ఫోన్ బూత్ ను ఏర్పాటు చేసి ఒక్కో కంటెస్టంట్ ని ఫోన్ లిఫ్ట్ చేయమని చెబుతూ వారితో ఫోన్లో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో వరుణ్ ని ’బిగ్ బాస్’ హౌస్ లో బెడ్ రూం లో ఎన్నిసార్లు ’కంట్రోల్.. కంట్రోల్’ అని అనుకున్నావు అంటూ వరుణ్ ను రవి అడిగాడు. ఈ ప్రశ్న విని షాక్ అయిన వరుణ్.. ’మీరేం మాట్లాడుతున్నారో నాకర్దం కావడం లేదని’ అన్నాడు. దాంతో ’మీకు అర్దమైందని నాకు తెలుసు’ అని రవి అన్నాడు.

’మనది ఫ్యామిలీ షో కదా’ అని వరుణ్ కవర్ చేసినప్పటికి.. రవి మాత్రం పదే పదే అదే ప్రశ్నతో వరుణ్ ను విసిగించాడు. ’నాకు అలా ఎప్పుడు అనిపించలేదు. మేము టాస్క్ ఆడటానికి హౌస్ లోకి వచ్చాం. హనీ మూన్ కీ రాలేదు’ అని ఘాటుగా జవాబు ఇచ్చాడు వరుణ్. ఇక ఈ విషయంలో వరుణ్ ఫ్యాన్స్ రవి పై గట్టిగానే ట్రోలింగ్ చేస్తున్నారు. ’వరుణ్ బెడ్ రూమ్.. విషయాలు నీకేందుకు రవి, నీకు అసలు సెన్స్ ఉందా’ అంటూ రవిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Loading...