అల్లు అర్జున్ సినిమాలో యాంకర్ సుమ.. ఆ పాత్రలో..?

720
Anchor Suma Will Appears In Allu Arjun Pushpa Movie
Anchor Suma Will Appears In Allu Arjun Pushpa Movie

బుల్లితెరపై తమ క్రేజ్ తో హల్ చల్ చేసే యాంకర్స్ వెండితెరపై కూడా రాణించాలని అనుకుంటారు. అలా కొందరు రాణిస్తున్నారు కూడా. వారిలో అనసూయ, రష్మీ, శ్రీముఖి, సుడిగాలి సుధీర్, ప్రదీప్ లాంటి వారు బుల్లితెరపై చేస్తూనే సినిమాల్లో కూడా అలరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన క్రియేటివిటీకి మరింత పదునుపెట్టి యాంకర్ సుమతో ‘పుష్ప’ సినిమాలో కీ రోల్ పోషింప జేయాలని ఫిక్స్ అయ్యారట. గతంలో రంగస్థలం సినిమాలో అనసూయకు రంగమ్మత్త క్యారెక్టర్ ఇచ్చిన సుకుమార్.. ఈ సారి యాంకర్ సుమతో స్కెచ్ వేశారని తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో హీరోకి అక్క పాత్ర ఒకటుందట. ఈ పాత్ర సినిమానే మలుపు తిప్పేదిగా ఉంటుందని టాక్. అయితే ఈ రోల్ కోసం సుమ అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యారట డైరెక్టర్ సుకుమార్. ఇప్పటికే దీనికి సంబంధించి ఒప్పందం కూడా జరిగిందనే వార్తలు వస్తున్నాయి. రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన పాత్ర ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ‘పుష్ప’ సినిమాలోనూ సుమకు అదే తరహా పాత్రను డిజైన్ చేశారని సమాచారం. ఈ విషయంపై అఫీషియల్ గా ప్రకటన రానుంది. ఇక గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ‘పుష్ప’ మూచూ తెరకెక్కుతుంది. అల్లు అర్జున్ పుష్పరాజ్ గా ఈ సినిమాలో నటిస్తున్నాడు. లారీ డ్రైవర్‌గా పూర్తి మాస్ అప్పీయరెన్స్ ఇవ్వనున్నారు బన్నీ. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. పల్లెటూరు అమ్మాయిగా ఆమె కనిపించబోతుందని తెలుస్తోంది.

Loading...