తెలుగు బుల్లి తెరపై ఎన్నో మంచి షోస్లో యాంకర్ గా చేసింది ఉదయ భాను. యాంకర్ గా.. హోస్ట్ గా చేసి చాలా మంది అభిమానులను సంపాదించుకుంది ఉదయ భాను. యాంకర్ గా చేస్తునే.. సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. ఉదయ భాను బయటకు ఎంతో హూషారుగా కనిపించిన రీయల్ లైఫ్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది.
ఆమెకు కెరీర్ మొదలైన దగ్గర నుండి కాదు చిన్నప్పటి నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. చిన్నప్పుడే ఆమె తన తండ్రిని కోల్పోయింది. అంతేకాదు ఆమె తల్లి మరో పెళ్లి అయిన వాడిని పెళ్లి చేసుకోవడంతో ఉదయభాను కష్టాలు బాగా పెరిగాయి. ఉదయ భాను యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి సంపాదించిన సొమ్ము మొత్తం ఆమె తల్లి తీసుకునేదట. ఈ విషయం ఉదయ భాను బాధపడుతూ కొన్నిసార్లు మీడియా ముందు చెప్పింది కూడా. అంతేకాకుండా ఉదయ భానుకు పెళ్లి అయ్యాక కూడా ఆమె తల్లికి డబ్బు మీద ఆశ చావక పలు సార్లు డబ్బులు ఇవ్వమంటూ ఇవ్వకపోతే చంపేస్తాను అంటూ బెదిరిందంట. ఇది భరించలేక ఉదయ భాను ఆమె తల్లికి దూరమై కేరీర్ ను మళ్లీ మొదలు పెట్టింది.
{loadmodule mod_custom,Side Ad 1}
అంతా బానే ఉంది అనుకుంటున్న సమయంలో ఒక డైరెక్టర్ ఉదయభానుకు వచ్చిన ఆఫర్స్ అన్ని పక్కదారి పట్టించాడు అని ఆ మధ్య రూమర్స్ వినిపించాయి. ఇప్పటికి కూడా ఆమెకు అవకాశాలు రాకుండా ఆ దర్శకుడు చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఉదయభానుకు ఈ మధ్యనే కవల పిల్లలు పుట్టిన సంగతి తెలిసిందే. ఆమె పిల్లలను చూసుకుంటూ.. యాంకర్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. కొంతమంది సన్నిహితులు మాత్రం ఉదయభాను చాలా మంచిదని ఎంతో మందికి సహాయపడిందని అంటూన్నారు. అలనే ఉదయభానుకు శత్రువులు కూడా చాలా మందే ఉన్నారని తెలుస్తోంది. ఏది ఏమైన తన కుటుంబంతో ఉదయభాను సంతోషంగా ఉండాలని కోరుకుందాం.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}r092bOdwVuo{/youtube}
Related