Friday, April 26, 2024
- Advertisement -

అతనితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన అనుష్క..!

- Advertisement -

అనుష్క పెళ్లి పై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఎక్కువ కాలం ప్రచారం జరిగింది. తర్వాత క్రికెటర్ తో.. తాజాగా విడాకులు తీసుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడిని పెళ్లి చేసుకోనుందన్న వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు పెద్దగా స్పందించని అనుష్క.. ఎప్పుడు సరదాగే పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చే అనుష్క ప్రకాష్ కోవెలమూడితో వివాహం గురించి వచ్చిన వార్తలపై హర్ట్ అయినట్లుగా తెలుస్తోంది.

అనుష్క సినీ కెరీర్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఒక ఇంగ్లీష్ డైలీకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఒక డైవర్సీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నట్లుగా కథనాలు రావడంపై ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పెళ్లి చాలా సున్నితమైనది. అలాంటి విషయంపై ఇలాంటి ప్రచారాలు చేయడం తప్పు. ఆ వార్తలు విని వారి కుటుంబం ఎంత బాధపడుతుందో అర్దం చేసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పెళ్లి అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దాన్ని ఎవరు దాచలేరు. సెలబ్రిటీలు ఎవరితోనైన ప్రేమలో ఉంటే ఆ విషయంను కచ్చితంగా దాచలేరు. రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. నా పెళ్లి ఎప్పుడు ఫిక్స్ అవుతుందో అప్పుడు కచ్చితగా బయటకు చెప్తానని అనుష్క చెప్పింది. ప్రస్తుతం అనుష్క నటించిన ’నిశబ్దం’ రిలీజ్ కు రెడీ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -