ఇంట్లో చాలా గొడవలు అయ్యాయి : యాంకర్ శ్యామల

1028
bigg Boss 2 Fame Anchor Shyamala Share Quarantine Experience
bigg Boss 2 Fame Anchor Shyamala Share Quarantine Experience

షూటింగ్‌లు లేక రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న యాంకర్ శ్యామల.. పిల్లల్ని చూసుకోవడం.. ఇంటి పనులు, వంట పనులు ఎంత కష్టమో చెప్పుకొస్తూ ఈ క్వారంటైన్‌ ఇలాగే ఉంటే పిచ్చి ఎక్కిపోవడం గ్యారంటీ అంటుంది. ఈ క్వారంటైన్ మొత్తం మూడు గిన్నెల తోముడు.. రెండు పూట్ల వండుకుని తినడంలా ఉందని అంటున్నారు యాంకర్ శ్యామల.

పిల్లలకు వండి పెట్టడం.. నా ఫస్ట్రేషన్ అంతా నా మొడుగుపై చూపించడం.. అరుచుకోవడం.. కొట్టుకోవడం మళ్లీ.. సారీ చెప్పుకోవడంలా నడుస్తోంది. ఈ క్వారంటైన్‌లో ఇద్దరి మధ్య చాలా గొడవలు అయ్యాయి.. ఎప్పుడూ గిన్నెలు నేను కడగాలా?? దాంధూం అంటూ గొడవ పెట్టా.. అప్పటి నుంచి బాగా హెల్ప్ చేస్తున్నాడు. స్టార్టింగ్‌లో నేనే అతి ప్రేమ చూపించి పాపం నువ్వేం చేస్తావ్ లే.. వద్దులే అని అన్నా.. తరువాత నేనే అరిచా.. నేనే హెల్ప్ చేయమని అడిగా.. ఇంట్లో ఖాళీగా ఉంటే బుర్ర పిచ్చెక్కిపోతుందని ఈ క్వారంటైన్‌లోనే తెలుసుకున్నా. ఈ పనుల వల్ల చేతు కాయాలు కాచాయి.

ఇక ఇళ్లు మొత్తం ఊడ్చుకోవాల్సి వస్తోంది. అలానే నాకు ఈ ఇంటి పనుల్లో నచ్చనిది ఒక్కటి ఉంది. అది బట్టలు ఉతకడం. నేను వాషింగ్ మిషీన్ లో బట్టలు వాడను. చేత్తో ఉతికితేనే నచ్చుతుంది. అవే వేసుకుంటా. పని మనిషితో ఉతికించుకుంటా. నా చిన్నప్పటి నుంచి వాషింగ్ మెషీన్ లేదు. అదే అలవాటు వల్ల ఇప్పుడు కూడా కొనలేదు. ఇప్పుడు బట్టలు ఉతుకోవాల్సి వస్తొంది” అంటూ తన ఇంట్లో కష్టాలను చెప్పుకొచ్చింది శ్యామల.

Loading...