Friday, April 26, 2024
- Advertisement -

ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన చలపతిరావు

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి హీరో.. మంచి నటుడని.. సీనీయర్ నటుడు చలపతి రావు అన్నారు. కానీ ఎన్టీఆర్ కి సరైన పర్సనాలిటీ లేకపోవడం అతడికి పెద్ద మైనస్ అని ఆయన అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర అయినా చేయగలడు బాగా నటిస్తాడు. డైలాగ్ బాగా చెబుతాడు. కానీ హైట్ ఉండడు. మరీ జానెడైపోయాడు పాపం. ఒక రావణాసురుడి తరహా పాత్ర చేయాలి అంటే అతడి ఫిట్ నెస్ సరిపోదు. అలాగని ఒక నటుడి గురించి మనం కామెంట్ చేయకూడదు.

ఎవరైనా అతడితో సినిమా తీస్తాం.. రావణాసురుడి పాత్ర వేయిస్తాం అంటే ఏం మాట్లాడను. ప్రేక్షకులు చూస్తారో.. చస్తారో.. అది వాళ్లిష్టం. మనమేం మాట్లాడకూడదు’’ అని అన్నారు చలపతి రావు. సీనీయర్ ఎన్టీఆర్ తనకు ఎన్నో రకాలుగా స్పూర్తి అని.. ఆయనలాగే ముక్కుసూటిగా మాట్లాడతానని చలపతి రావు అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అయినా.. బాలయ్య అయినా రామారావుకు నట వారసులని తాను భావించనని.. ఆయనకు ఎవ్వరూ వారసులు కారని చలపతిరావు స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ చుట్టూ పది కిలోమీటర్ల దూరంలో ఎవరూ రాలేరని.. ఆయన నటన.. ఆయన స్టైల్.. ఆయన్ ధర్మాత్మికత.. ఆయన క్రియేషన్.. వేటిలో కూడా ఎవరూ ఆయనకు సాటి రారని చలపతిరావు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పౌరాణికాలు ‘శ్రీ కృష్ణార్జున యుద్ధం’.. ‘పాండురంగ మహత్మ్యం’.. లాంటి సినిమాల్ని బాలకృష్ణ రీమేక్ చేశాడని, అవన్నీ ఫ్లాపులే అని.. ఎన్టీఆర్ సినిమాలు వేటినీ ఎవ్వరూ టచ్ చేయకూడదని.. ఏది చేసినా ఫ్లాపే అవుతుందని చలపతిరావు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ మరణం గురించి అడిగితే.. ఆయన టైమైపోయిందని, వెళ్లిపోయారని.. దాని గురించి ఇంకేమీ మాట్లాడకూడదని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -