ఛార్మీ పెళ్లి.. అందుకే ఆగిపోయిందా ?

776
Charmme Kaur marriage news goes viral
Charmme Kaur marriage news goes viral

’నీతోడుకావాలి’ అనే తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అందాల తార ఛార్మీ. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా నటించిన ‘నీకే మానసిచ్చాను’ అనే చిత్రంలో కూడా నటించింది. అయినప్పటికి ఈ భామకు ఎక్కువగా ఆఫర్స్ రాలేదు. కానీ కృష్ణవంశీ డైరెక్షన్లో చేసిన ‘శ్రీ ఆంజనేయం’ చిత్రంలో ఓ రేంజ్ గ్లామర్ షో చేసి అందరి కంట్లో పడింది. ఆ సినిమా హిట్ కాకపోయినా.. ఈ భామకు మాత్రం మంచి పేరు వచ్చింది. అందుకే వరస ఆఫర్స్ వచ్చాయి.

తక్కువ టైంలోనే ప్రభాస్,రవితేజ, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ చేసింది. ‘మంత్ర’ ‘మంగళ’ ‘జ్యోతి లక్ష్మీ’ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది. తర్వాత ఎందుకో సినిమాలో నటించడం మానేసి.. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు సహ నిర్మాతగా బాధ్యతలు తీసుకుంది. అయితే పూరి జగన్నాథ్ తో ఛార్మీ రిలేషన్ షిప్ లో ఉందని వార్తలు కూడా భానే వచ్చాయి.

సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల రేంజ్లో వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండడం చూసి ఇది బహిరంగ రహస్యమే అని అంతా అనుకున్నారు. అయితే ఈ వార్తలను ఛార్మీ ఖండిచింది. ’పూరి తనకు మంచి ఫ్రెండ్’ అని తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఛార్మీ పెళ్ళి చేసుకోవడానికి ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ‘లాక్ డౌన్ కారణంగానే పెళ్ళి వాయిదా పడిందని లేకుంటే.. ఈపాటికి ఛార్మీ పెళ్ళైపోయేదని’ ఇన్సైడ్ టాక్. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Loading...