ఈసారి ‘బిగ్ బాస్-4’లో వెళ్లేది ఈ కపులే..?

1408
Choreographer Raghu and his wife Pranavi Acharya in Bigg Boss 4
Choreographer Raghu and his wife Pranavi Acharya in Bigg Boss 4

బిగ్ బాస్ షోకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ షో వస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వీక్షించేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. హౌస్ లో ఎలాంటి పరిస్థితి ఉందో.. షో ఎలా నడుస్తుందని ప్రతి ఒక్కరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. టైం దొరికితే ఇందుకు సంబంధించి ఎపిసోడ్స్ రిపీట్ చేసేవారు కూడా ఉన్నారు.

అయితే త్వరలో బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదలు కాబోతుందని ఇటీవలే స్టార్ మా యాజమాన్యం ప్రోమో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బిగ్ బాస్ కోసం తెలుగు జనాలు ఎప్పటినుందో ఎదురు చూస్తున్నారు. కరోనా రావడంతో అన్నీటి టైమింగ్స్ మారిపోయాయి. జూన్ లోనే ప్రారంభం అవుతుందనుకున్నారు. కానీ కరోనా వల్ల అది కుదరలేదు. ఆకరికీ అసలు ఈసారి బిగ్ బాస్ ఉంటుందా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. అయితే షో పక్కా ఉంటుందని క్లారిటీ రావడంతో బిగ్ బాస్ ప్రేక్షకులు ఖుషి అయ్యారు. దాంతో ఈ సారి కంటెస్టెంట్స్ ఎవరనేది ఆసక్తి మొదలయింది.

ఈసారి గ్లామర్ హీరోయిన్లను తీసుకొస్తాం అని బిగ్ బాస్ యాజమాన్యం ఇప్పటికే ఊరించారు. ఆ విషయం పక్కన పెడితే గత సీజన్ లో హీరో వరుణ్ సందేశ్ అతని భార్య వితిక షేరు పాల్గొని హల్ చల్ చేశారు. ఈ సారి కూడా ఓ టాలీవుడ్ కపుల్ బిగ్ బాస్ లోకి పంపేందుకు యాజమాన్యం ప్లాన్ చేస్తుందట. వారే కొరియోగ్రాఫర్ రఘు ఆయన భార్య సింగర్ ప్రణవి అని తెలుస్తోంది. అధికారిక ప్రకటన రాలేదు కానీ ఈ లవ్ కపుల్ అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ -4 కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేయనున్నారట.

రష్మీని వదిలేసి వర్షిణితో రొమాన్స్ చేస్తున్న సుధీర్..!

నితిన్ పెళ్లికి పవన్ వెళ్లొద్దు అంటున్న అభిమానులు.. కారణం ?

బిగ్ బాస్ 4 రాబోతుంది.. పాల్గోనే 15 మంది సెలబ్రిటీలు వీరే..!

నన్ను ఆ కేసులో ఇరికించింది అతనే : సుమన్

Loading...