Friday, April 26, 2024
- Advertisement -

కమెడీయన్ సుధాకర్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన సుధాకర్ గారు గుర్తున్నారా ? గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బయట కానీ సినిమా ఫంక్షన్స్ లో కానీ ఎక్కడా కనిపించడం లేదు. ఒక్కప్పుడు బిజీ షెడ్యూల్ తో తెగ సినిమాలు చేసేవారు. హీరోగా, కమెడీయన్ గా, నిర్మాతగా చాలా సినిమాలు చేశారు. అయితే ఆయనను బయట చూడక చాలా కాలమైంది.

రెండు సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సుధాకర్ గారు ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ మాయమైపోయారు. అయితే రీసెంట్ గా సుధాకర్ గారికి సంబంధించిన కొన్ని వీడియోస్ బయటికొచ్చాయి. ఒక అభిమాని సుధాకర్ గారి ఇంటికి వెళ్లి ఆయన్ను కలిసి మాట్లాడారు. అప్పుడు దిగిన ఫొటోస్, వీడియోస్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్న ఆ అభిమాని. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అతని షేర్ చేసిన వీడియోలు చూసిన కొందరు అభిమానులు.. సుధాకర్ గారు మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తన మాటలతో.. కామెడీ టైమింగ్ తో.. ఎంతగానో నవ్వించిన సుధాకర్ గారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బానే ఉందట. ఎవరైనా ఛాన్స్ ఇస్తే తిరిగి మళ్లీ నటించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -