ఒక్క యాడ్ కోసం మహేష్ ఫ్యామిలీ పారితోషకం ఎంతంటే ?

480
how much money take mahesh babu family in surya developers ad
how much money take mahesh babu family in surya developers ad

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికి ఫ్యామిలీకి టైం మాత్రం కచ్చితంగా ఇస్తారు. సమయం దొరకడం ఆలస్యం ఫ్యామిలీతో సరదగా గడుపుతుంటాడు. అందరు మహేష్ బాబులా ఉండాలని అంటూ ఉంటారు. యాడ్స్ కి మహేష్ బాబు చాలా ఫేమస్. ఇప్పటికే చాలా యాడ్స్ చేశాడు. అయితే మహేష్ బాబుకు యాడ్స్ చేయడం కొత్తేం కాదు కానీ ఈ సారి ఏకంగా ఫ్యామిలీ మొత్తంను యాడ్ కోసం తీసుకొచ్చాడు.

సాయి సూర్య డెవలపర్స్ కు మహేష్ ప్రమోటర్‍గా వ్యవహరిస్తున్నాడు. ఈ కంపెనీ కొత్త యాడ్ కోసం ఫ్యామిలీ మొత్తం నటించారు. మహేష్ భార్య, పిల్లలు ఈ యాడ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే డబ్బు కోసం ఫ్యామిలీని కూడా యాడ్ లో భాగం చేయాలా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. కావాలని ఫ్యామిలీ నటించలేదని.. అవసరం కాబట్టి చేసినట్లు మహేష్ సన్నిహితులు అంటున్నారు.

మాములుగా అయితే ఒక యాడ్ చేస్తే మహేష్ బాబు రెండు నుంచి మూడు కోట్ల వరకు తీసుకుంటాడు. ఈ యాడ్ లో ఫ్యామిలీ మొత్తం ఉంది కాబట్టి ఐదు కోట్ల వరకు తీసుకున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సదురు కంపెనీ రెండు మహేష్ తో సంవత్సరాలు ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మరో యాడ్ లో ఫ్యామిలీ అంత కలిసి నటించనున్నారు.

Loading...