Friday, April 26, 2024
- Advertisement -

జబర్దస్త్ బాధ్యతను తీసుకున్న నాగబాబు.. ఎందుకు ?

- Advertisement -

ప్రముఖ ఛానెల్ లో వచ్చే జబర్దస్త్ షో గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వారంలో రెండు రోజుల పాటు మనల్ని ఎంతగానో నవ్విస్తోంది జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ గా మారారు. కొందరు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక జడ్జిలుగా నాగబాబు, రోజా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ షో రేటింగ్స్ కూడా చాలా బాగుంటాయి.

అయితే ఈ షోకి నాగబాబు, రోజాతో పాటు కంటెస్టెంట్స్ ఎంత ఇంపార్టెంటో.. తెరవెనక దర్శకులు కూడా అంతే ఇంపార్టెంట్. వారికి షో నడపాలంటే ఎంతో పని ఉంటుంది. కాబట్టి జబర్దస్త్ షోలో కీలక పాత్ర పోషిస్తున్నారు నితిన్, భరత్. అయితే ఇప్పుడు వీరిద్దరు షో నుంచి బయటకు వచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సుడిగాలి సుధీర్ యాంకర్ గా వచ్చే పోవే పోరా హో కొనసాగింపు విషయంలో కూడా మల్లెమాలతో ఈ హెడ్స్ కు క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

అందుకే ఈ షో నుంచి వాళ్లు వాకౌట్ చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దాంతో ఇప్పుడు జబర్దస్త్ యూనిట్ కంగారులో పడిపోయారు. ఇదే టైంలో షో బాధ్యత అంతా నాగబాబు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని సీరియల్స్ రాసిన అనుభవం నాగబాబుకు ఉంది. దాంతో ఇప్పుడు ఈ షోపై నాగబాబు స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -