Friday, April 26, 2024
- Advertisement -

కార్తీక దీపం ఎపిసోడ్లు లీక్.. స్టార్ మా నో యాక్షన్..!

- Advertisement -

కార్తీక దీపం సీరియల్ తెలుగు బుల్లితెర పై స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7:30 గంటలకు ప్రసారం అవుతుంది. అలానే హాట్ స్టార్ లో కూడా ప్రసారం అవుతోంది. ఈ సీరియల్ మొదలు అయినప్పటి నుంచి రేటింగ్ అద్భుతంగా వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సీరియల్స్ లో కార్తీక దీపం అగ్రస్థానంలో ఉంది. మలయాళంలో ప్రసారం అవుతున్న కరుతముతూ సీరియల్ కు కార్తీక దీపం రీమేక్. ముదురు రంగు చర్మం గల, స్వచ్చమైన మనసు ఉన్న అమ్మాయి దీపా (ప్రీమి విశ్వనాథ్) లైఫ్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతోంది.

ఆమె రంగు కారణంగా ఆమె ఆనేక పరీక్షలు మరియు కష్టాలను ఎదుర్కొంటుంది. ఆమె డాక్టర్ కార్తిక్ (నిరుపమ్ పరితాలా) ను పెళ్లి చెసుకుంటుంది. ఆమె ప్రతి సందర్భంలోనూ ప్రేమ మరియు విశ్వాసం చూపిస్తూ ఉంటుంది. అలా ఆమె జీవితం చూట్టు కథ నడుస్తోంది. ఇప్పటికే ఈ సీరియల్ వస్తుందంటే ఎన్ని పనులు ఉన్న ఆపేసుకుని టీవి ముందలా వాలిపోతారు చాలా మంది. అంతలా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్. అయితే ఈ సీరియల్ ప్రతి రోజు 7:30 గంటలకు టీవిల్లో ప్రసారం అవుతుంది. హాట్ స్టార్ లో కూడా ఆ టైం లోనే అందుబాటులో ఉంటుంది.

అయితే ఇప్పుడు గత రెండు రోజులుగా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో రాత్రి 7:30 గంటలకు ప్రసారం కావాల్సిన ఎపిసోడ్ ను పది గంటలకు ముందే యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు. సీరియల్ మొత్తం అప్లోడ్ చేస్తున్నారు. సీరియల్ లో పాత్రలు మాట్లాడే వాయిస్ ను మ్యూజిక్ ను తీసుకుని ఫోటోలను ప్లే చేస్తూ.. ఎపిసోడ్ మొత్తం అప్లోడ్ చేస్తున్నారు. మరి ఆ ఎపిసోడ్ కు సంబంధించిన వాయిస్ ఫీడ్ ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు కానీ ఆ వీడియోస్ కి వ్యూస్ మాత్రం భలే వస్తున్నాయి.

మరి టీవీలోకి వచ్చేకంటే ముందే ఇలా యూట్యూబ్ లో వస్తుంటే స్టార్ మా ఏం యాక్షన్ తీసుకోకపోవడం చర్చకు దారి తీస్తుంది. ఇది ఇలానే కొనసాగితే స్టార్ మా టీఆర్పీ రేటింగ్ దారుణంగా పడిపోయే అవకాశం చాలానే ఉంది. మరి ఇప్పటికైన స్టార్ మా యాక్షన్ తీసుకుంటుందో లేదో తెలియదు కానీ.. కార్తీక దీపం ఫ్యాన్స్ మాత్రం కొన్ని గంటల ముందే ఆ రోజుకు సంబంధించిన ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=Le85KdooP0w

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -