Saturday, April 27, 2024
- Advertisement -

ఆ ప్రొడ్యూసర్ కి అదృష్టం అలా వచ్చింది..

- Advertisement -

కొన్ని సంవత్సరాల క్రితం ఒక సినిమా మేనేజర్ అమీర్‌పేట మైత్రివనం దగ్గర black shirt  వేసుకుని నైట్ 2:30 నుండి wait చేస్తున్నాడు.. ఏదైనా బస్ కోసం… ఎందుకంటే ఆటోకి వెళ్ళడానికి డబ్బులు లేవు.. అలా 30 మినిట్స్ wait చేశాడు.. పక్కన ఉన్న వాళ్ళు ఇంచు మించు అందరూ వెళ్ళారు.. ఇక ఇతనే మిగిలాడు.. ఇంతలో ఒక వ్యాన్ వచ్చింది. 

ఇదిగో ఈ బ్యాగ్‌లు రేపు మహారాష్ట్రలో ఉండాలి.. నువ్వు ఇక్కడ ఉండటం మంఛిది కాదు తొందరగా తీసుకొని వెళ్ళు… ముందు కెళ్ళి నీ black shirt తీసేసి రెడ్ shirt వేసుకో ok అని ఆ వ్యాన్ వెళ్ళిపోయింది.. ఆ వచ్చిన వారు ఎవరో తనకు ఈ మూడు బ్యాగ్‌లు ఎందుకు ఇచ్చారో అందులో ఏమున్నాయో అసలు ఇతనికి ఏం అర్థం కాలేదు.. భయమేసింది.. ఒకవేళ బ్యాగ్స్‌లో బాంబ్‌లు ఉన్నాయా.. ఐనా నేను black shirt ఎందుకు తీసెయ్యాలి..  ఇలా చాలా అనుమానాలు వస్తున్నాయి.. డేర్ చేసి అసలు ఇందులో ఏమున్నాయ్ అని ఆ బ్యాగ్ లని ఒపెన్ చేసి చూశాడు.. చెమటలు పట్టాయి.. కంగారు పడ్డాడు.. అటుగా వస్తున్నా ఆటోని పిలిచి జీడిమెట్ల కి ఎంత అన్నాడు.. 200 అన్నాడు.. 150 ఇస్తా అన్నాడు.. వాడు కుదరదు అన్నాడు.. పోనీ 175 అన్నాడు ok అని ఆటో ఎక్కాడు.. ఎందుకు బేరమాడాడు అంటే ఎంతైనా మేనేజర్ బుద్దులు కదా.. ఎంతైనా సరే ఇస్తా అంటే వీడేవడో బాగా డబ్బులు ఉన్నోడు అని మద్యలో ఏదైనా చేసి ఈ బ్యాగ్‌లు తీసుకుంటే… అందుకే బేరమాడాడు.. ఇంటి కెళ్ళి బ్యాగ్‌లో డబ్బులు లెక్క పెట్టాడు.. అక్షరాల 3 కోట్లు ఉన్నాయి.. ఆ డబ్బుతో అప్పటికి సినిమాలు చేయక చాలా సంవత్సరాలు ఖాళీగా ఉన్న ఒక డైరెక్టర్‌తో మూవీ ప్లాన్ చేశాడు.. అది హిట్ అయ్యింది.. ఇంకో సినిమా చేశాడు.. అదీ హిట్ అయ్యింది.. 

ఆ 3 కోట్లు కాస్త 33 కోట్లు అయ్యాయి.. ఇక పెద్దహీరోలతో మూవీ తీశాడు.. అవి బెడిసి కొట్టాయి.. ఇది అంతా with in 4 years లో జరిగింది.. ఇంతలో ఎవరైతే అక్కడ డబ్బుల బ్యాగ్‌లు ఇచ్చారో వాళ్ళు వచ్చారు.. ఇక సీన్ సితారే ఉన్న డబ్బులు మొత్తం లాక్కెళ్ళారు.. ఇంతకీ మ్యాటరేంటంటే అప్పుడు ఎన్నికల టైమ్ మైత్రివనం దగ్గర black shirt వేసుకొని ఉన్నవాడు.. ఈ బ్యాగ్ మహారాష్ట్రలో ఇవ్వాలి.. అది డీల్… వాడు వీడే అనుకొని డబ్బులు ఇచ్చారు.. ఇంతలో ఇదంతా జరిగింది.. ఇపుడు ఆ ప్రొడ్యూసర్ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికి తెలీదు.. మొత్తానికి మన మేనేజర్ సాధ్యుడే.. అవును.. ఇంతకీ ఎవరా మేనేజర్ కం ప్రొడ్యూసర్.. just think… 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -