Saturday, April 27, 2024
- Advertisement -

నాకు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు వచ్చాయి : మాధవీలత

- Advertisement -

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ చెప్పారు. ఛాన్స్ ల పేరుతో అమ్మాయిలను వాడుకుంటున్నారని దీనిపై పొరాటం జరుగుతునే ఉంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అనుకునేవారికి ఛాన్సులు రావడం లేదు. అయితే పడకగదిలోకి వస్తేనే ఛాన్సులు ఇస్తామని కొందరు అంటున్నారని శ్రీ రెడ్డి లాంటి వాళ్ళు గొంతెత్తి అరిచారు. ‘మీటూ’ అంటూ ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ మాధవీ లత క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. తనీష్ ‘నచ్చావులే’, నాని ‘స్నేహితుడా’ చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన ఈమె.. మహేష్ బాబు అతిథి సినిమాలో కీలకపాత్రలో కనిపించింది. తర్వాత ఈ భామకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక 2019 ఎన్నికల్లో పాల్గొంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మధవీలత మాట్లాడుతూ.. ”కమిట్మెంట్ అనేది చాలా పవిత్రమైన పదం. కానీ దాన్ని సినీ పరిశ్రమలో మనోళ్లు ఇలా మార్చేశారు. కమిట్మెంట్ అంటే ఇప్పుడు పడుకోవడం అనే అర్ధానికి దిగజార్చారు. వాస్తవానికి కమెట్మెంట్ అంటే ఒప్పుకున్న పని కంప్లీట్ చేయడం. కానీ ఇక్కడ మాత్రం కమిట్మెంట్ అంటే పడుకోవడానికి వస్తావా అన్నట్లు మార్చేశారు. నాకు ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పట్లో నన్ను కమిట్మెంట్ అడిగారు. అయితే అందుకు నేను ఒప్పుకోలేదు. పడకగదిలోకి వెళ్లకుంటే ఎవరూ మన టాలెంట్ ను గుర్తించరు” అని మాధవిలత చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -