Saturday, April 27, 2024
- Advertisement -

మహేశ్ బాబు సినిమా ఫలితంపై ఆధారపడ్డ ఎన్టీఆర్ సినిమా!

- Advertisement -

తెలుగు హీరోల్లో ఎన్టీఆర్ కు చిత్రమైన అలవాటు ఉంది. హిట్ వెంట పడే అలవాటు ఇతడిది. ఇండస్ట్రీలో హిట్ ను నమోదు చేసిన దర్శకుడితో సినిమా చేయడానికి తపిస్తాడు జూనియర్. ఆది నుంచి ఎన్టీఆర్ ఇదే రీతిలో కొనసాగుతున్నాడు.

తన సాటి హీరోలతో ఎవరైనా దర్శకుడు మంచి హిట్ సినిమాను రూపొందిస్తే.. జూనియర్ ఆ దర్శకుడిపై కన్నేస్తాడు.అతడితో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తాడు.

ఇలాంటి తీరుతో జూనియర్ కొన్ని సార్లు హిట్స్ పొందాడు.. మరికొన్ని సార్లు ప్లాఫులు తప్పలేదు. మరి ఇలాంటి నేపథ్యంల ఇప్పుడు ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా సంగతి కూడా ఇదే సమీకరణం మీద ఆధారపడి ఉందని తెలుస్తోంది.  మిర్చి సినిమాతో టాలీవుడ్ కు చాలా గ్రాండ్ పరిచయం అయ్యాడు శివ. ఇప్పుడు ఆయన మహేశ్ తో సినిమాను పూర్తి చేశాడు.

అది త్వరలోనే విడుదల కానుంది. ‘శ్రీమంతుడు’ పేరుతో వస్తున్న ఈ సినిమా హిట్ అయితే గనుక వెంటనే ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో సినిమా రూపొందే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ సినిమా జనవరి నుంచి మొదలు కావొచ్చని సమాచారం. అయితే ఈ సినిమా పూర్తిగా ‘శ్రీమంతుడు’ ఫలితం మీదనే ఆధారపడి ఉన్నట్టుగా తెలుస్తోంది! మరి ఈ విధంగా మహేశ్ బాబు సినిమా ఫలితం మీద ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ కావడం ఆధారపడి ఉందనమాట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -