Friday, April 26, 2024
- Advertisement -

RRR అప్డేట్ : సీన్లు లీక్ చేసి రాజమౌళికి షాక్ ఇచ్చిన నటుడు..!

- Advertisement -

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా RRR. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున ఈ సినిమా ఎప్పుడెప్పుడూ వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ కూడా రాజమౌళి ఇవ్వడం లేదు.

ఈ భారీ సినిమా గురించి విషయాలేమీ బయటకురాని వేళ.. ఈ సినిమా లో నటించిన ఓ నటుడు చేసిన పనికి రాజమౌళికి భారీ షాకిచ్చేలా చేసింది. RRRలో సైడ్ క్యారెక్టర్లలో ఒక పక్కన నిలుచొని ఉండే డైలాగుల్లేని నటుడు ఒకరు.. RRRకు సంబంధించిన కీలక అంశాల్ని బయటపెట్టేయటంపై జక్కన్న యమా సీరియస్ గా ఉన్నాడట. కీలకమైన సీన్ల గురించి రివీల్ చేసిన ఇతగాడి తీరు ఇప్పుడు RRR టీంలో కలకలం రేపుతోంది. ముందు నుంచి ప్రచారం సాగుతున్నట్లుగా రాంచరణ్.. ఎన్టీఆర్ మధ్య ఫైట్ సీన్ ఉంటుందని చెప్పేయటమే కాదు.. అందులో తారక్ ను చెర్రీ కొడతాడంటూ అతగాడు భారీ సీక్రెట్ ను రివీల్ చేసేశాడు.

అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఫైట్ సీన్ ను పది రోజులు షూట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఒక సన్నివేశంలో బ్రిటిషర్ డ్రెస్ లో చరణ్ కనిపిస్తాడని.. మరొక సీన్ లో కుర్తా ఫైజమాలో తారక్ కనిపిస్తాడని అతగాడు చెప్పాడు. తన సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని గుట్టుగా ఉంచే రాజమౌళి ఇలా ఓ నటుడు లీక్ చేయడంపై చాలా సీరియస్ గా ఉన్నాడట. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇలా కొన్ని లీకులు రావడం రాజమౌళికి కాస్త తలనిప్పిగానే మారినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -