Saturday, April 27, 2024
- Advertisement -

బావమరిది సినిమా కోసం ఎన్టీఆర్ అదిరే ప్లాన్..!

- Advertisement -

మహానటుడు నందమూరి తారక రామారావు గారి కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే అందులో ఎక్కువగా సక్సెస్ అయింది మాత్రం బాలకృష్ణ. అయితే హరికృష్ణ సినిమాలో ఎక్కువగా సక్సెస్ కాలేకపోయారు. అయితే హరికృష్ణ తనయులు అయిన ఎన్టీఆర్ స్టార్ గా ఎదుగగా… కళ్యాణ్ రామ్ కూడా కొంతమేర రాణిస్తున్న విషయం తెలిసింది.

ఇదిలా ఉండగా… ఎన్టీఆర్ బావమరిది కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త టాలీవుడ్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. విషయంలోకి వెళ్తే.. ఎన్టీఆర్ భార్య అయిన లక్ష్మీ ప్రణతి తమ్ముడు.. అలాగే నార్నె శ్రీనివాసరావు కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. ప్రస్తుతం ఆయన ఎంట్రీకి సంబంధించిన చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు.. నటీనటులు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ సొంత బ్యానర్ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ బ్యానర్ లో ఎన్టీఆర్ బావమరిది ఫస్ట్ మూవీ నిర్మించే ఛాన్స్ లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా అలానే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.

బిగ్ బాస్ లోకి ఆంటీ, యాంకర్.. ఇక రచ్చ రచ్చే..!

ఆదిపురుష్.. ఇలాంటి సినిమా ప్రభాస్ కెరీర్ లో రాదట..!

హైపర్ ఆది మ్యానరిజం.. జెబులో చేయి ఎందుకు పెట్టాడు ?

అభిరామ్ నుంచి శ్రీరెడ్డి 6 కోట్లు తీసుకుందా ? శ్రీరెడ్డి ఏమన్నాదంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -