Friday, April 26, 2024
- Advertisement -

పవన్ డైరెక్టర్ హరీష్ శంకర్.. మాటలు త్రివిక్రమ్..!

- Advertisement -

రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న పవన్ కళ్యాన్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత కొంత కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్ లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ సినిమా ఉండబోతుండని అంత అనుకుంటున్నారు. హిందీలో అమితాబ్ నటించిన పింక్ సినిమాని.. ఇటివలే తమిళంలో అజిత్ తో రీమేక్ చేసి మంచి హిట్ కొట్టాడు బోనీ కపూర్.

ఇప్పుడు ఇదే సినిమాని దిల్ రాజుతో కలిసి తెలుగులో నిర్మించడానికి సిద్దం అవుతున్నాడు. పవన్ ను ఒప్పించే పనిలో దిల్ రాజు ఉన్నాడట. ఒక్కసారి పవన్ సరే అంటే డైరెక్ట్ చేయడానికి హరీష్ శంకర్ సిద్దంగా ఉన్నాడట. అయితే పవన్ రీఎంట్రీని ఇంకా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న మేకర్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ను లైన్ లో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

పింక్ తెలుగు లో రీమేక్ చేస్తే హరిష్ శంకర్ దర్శకత్వం వహించగా.. డైలాగ్స్ ని త్రివిక్రమ్ రాయనున్నాడట. ఈ ఇద్దరి కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని దిల్ రాజు ఈ ప్లాన్ చేస్తున్నాడట. గతంలో పవన్ తీన్మార్ అనే సినిమాకి త్రివిక్రమ్ మాటలు రాశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -