లీకైన ప్రభాస్ కొత్త సినిమా స్టోరీ..!

1437
prabhas pooja hegde starrer untitled romantic movie storyline leaked
prabhas pooja hegde starrer untitled romantic movie storyline leaked

జాతీయ స్థాయిలో బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ సంపాధించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సాహో సినిమాని కూడా ఆ స్థాయిలోనే తెరకెక్కించాడు కానీ ఆశించిన విజయం మాత్రం దక్కించుకోలేదు. ఇప్పుడు తన తదుపరి సినిమాని కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు ప్రభాస్.

అయితే సాహో విషయంలో జరిగిన తప్పులను మళ్లీ రిపీట్ కాకుండా చూసుకుంటున్నాడు. అందులే ముందుగా ఫైనల్ చేసిన స్టోరీని ఇప్పుడు ఫైన్ ట్యూన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గోపిచంద్ హీరోగా స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ జిల్‌ను తెరకెక్కించిన రాధకృష్ణ ప్రభాస్ మువీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంను ప్రభాస్‌ పెదనాన కృష్ణం రాజు యూవీ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కంప్లీట్ అయింది. అయితే తాజాగా ఈ చిత్రం స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ఇటలీ అబ్బాయి, ఇండియాల అమ్మాయిల మధ్య ప్రేమ కథ అని తెలుస్తోంది. ఇటలీలో ప్రేమలో పడిన ఈ జంట కొన్ని కారణాలతో దూరమవుతారు. అమ్మాయి ఇండియా తిరిగి వచ్చేస్తోంది. ఆ అమ్మాయిని వెతుక్కుంటూ హీరో కూడా ఇండియా వస్తాడు.

అలా ఇండియా వచ్చిన హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, తిరిగి హీరోయిన్‌ను ఎలా కలిసాడు అన్నదే ఈ చిత్ర స్టోరీ అని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇదే పాయింట్ తో చాలా చిత్రాలు వచ్చాయి. మరి ఇలాంటి స్టోరీలకు స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్‌లోనే ఇటలీ సెట్ ను వేశారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ సినిమాకి జాన్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Loading...