Friday, April 26, 2024
- Advertisement -

అలా చేస్తే అసలు ఛాన్స్ ఇవ్వరు : రకుల్ ప్రీత్

- Advertisement -

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ తక్కువే ఉన్నారు. ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ హవా కొనసాగుతోంది. మొన్నటి వరకు రకుల్ హవా బానే ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు రకుల్ కు అవకాశాలు తగ్గాయి. దాంతో ఆమె టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ లక్ టెస్ట్ చేసుకుంటుంది. ఇక తెలుగులో హీరోయిన్ రకుల్ ఇప్పటికే చాలా మంది హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇక ప్రస్తుతం ఆమె నితిన్ సరసన చదరంగం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే స్టార్ హీరోల సరసన ఛాన్సులు రాకపోవడంపై రకుల్ స్పందించింది. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు.. కలిసి పార్టీలు కూడా చేసుకుంటారు కదా మీకు ఎందుకు ఛాన్సులు రావడం లేదన్న ప్రశ్న రకుల్ కు ఎదురైంది. దీనికి ఆమె ఆసక్తికరమైన జవాబు ఇచ్చింది.

కలిసి తిరిగినంత మాత్రన.. కలిసి పార్టీలు చేసుకున్నంత మాత్రాన ఛాన్సులు వస్తాయి అనుకోవడం తెలివి తక్కువతనం అని చెప్పింది. కథకు తాము సరిపోతాం అనుకున్నప్పుడే దర్శక నిర్మాతలు ఛాన్సులు ఇస్తారని.. పార్టీలకు పిలిచారని ఆఫర్స్ ఇవ్వారని తెలిపింది. ఆ పాత్ర మనకోసమే పుడితే.. పార్టీలకు వెళ్లకున్న ఆఫర్ ఇస్తారని చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -