Friday, April 26, 2024
- Advertisement -

‘గీతా గోవిందం’ వ‌ల్ల రష్మిక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్?

- Advertisement -

ఛ‌లో సినిమాతో తెలుగు తెర ప‌రిచియ‌మైంది హీరోయిన్ ర‌ష్మిక‌.అంత‌క‌ముందు మ‌ళ‌యాళం కిరాక్ పార్టీలో న‌టించింది.ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన గీతా గోవిందం సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన ర‌ష్మిక ఈ సినిమాతో భారీ హిట్ కొట్టింది. ఈ సినిమా త‌రువాత వ‌ర‌స ఆఫ‌ర్లు అందుకుంటుంది ర‌ష్మిక‌.తెలుగులో ఆమె న‌టించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ హిట్లు కావ‌డంతో ఈ భామ‌కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది.ప్ర‌స్తుతం ర‌ష్మిక నాని – నాగ్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ దేవ‌దాస్ లో హీరోయిన్‌గా న‌టిస్తుంది.కెరీర్ ప‌రంగా పీక్‌లో ఉన్న ర‌ష్మిక వ్య‌క్త‌గ‌త జీవితంలో తీవ్రంగా ఇబ్బంది పడుతుంద‌ని తెలుస్తుంది.

గత కొద్దిరోజులుగా రష్మిక తన నిశ్చితార్దాన్ని రద్దు చేసుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.తన సహా నటుడు రక్షిత్ ని ప్రేమించి అతడితో నిశ్చితార్ధం చేసుకుంది రష్మిక. సినిమాల పరంగా బిజీగా ఉన్న ఆమె తన ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకుందని ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించడంతో ఆ వార్తలపై ఆమె స్పందించి అందులో నిజం లేదని చెప్పింది. తాజాగా మరో ఆంగ్ల పత్రిక రష్మిక-రక్షిత్ ల నిశ్చితార్ధం రద్దయిందంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. కెరీర్‌పై దృష్టి పెట్టిందని ఆ కారణంతోనే నిశ్చితార్దాన్ని క్యాన్సిల్ చేసుకుందని రష్మిక సన్నిహితులు ఏఈ విషయాన్ని వెల్లడించినట్లు సదరు పత్రిక పేర్కొంది. మ‌రి దీనిపై ర‌ష్మిక ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తుందో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -