సినీ ఇండస్ట్రీకి రోజా కుమార్తె ఎంట్రీ ?

1484
Roja’s daughter in every frame this time
Roja’s daughter in every frame this time

ఆర్కే రోజా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమె రాజకీయాల్లో ప్రస్తుతం కొనసాగుతునే జబర్దస్త్ షోలో జడ్జీగా ఉన్నారు. అయితే ఆమె ఏం మాట్లాడిన అది వార్తగా మారుతోంది. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఒక పక్క మరో పక్కా జబర్దస్త్ షోకు మంచి జడ్జీగా కొనసాగుతూ రెండూ బాలెన్స్ చేస్తోంది. ఇక సంక్రాంతి వచ్చిందంటే చాలు.. తాను ప్రాతినిధ్యం వహించే నగరి కి వెళ్లిపోతారు. పూర్తిగా అక్కడే ఉండిపోతారు.

అక్కడ సంక్రాంతి పండుగ మొత్తం రోజా చుట్టునే ఉందా ? అన్నట్లుగా ఉంటుంది. ఎప్పటిలానే ఈసారి సంక్రాంతికి సైతం రోజా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. పండుగలో భాగంగా తాజాగా నగరి లో ఉంటున్న ఆమె.. ముగ్గులు వేయటం దగ్గర నుంచి.. ఎడ్ల బండి నడపటం వరకూ ఎక్కడా తగ్గట్లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే గా.. ఏపీఐఐసీ ఛైర్మన్ గా బిజీ గా ఉన్నప్పటికీ.. వాటిని పక్కన పెట్టేసిన కుటుంబం తో కలిసి సంక్రాంతి వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ వేడుకల్లో ఈ సారి తన కుమార్తె అన్షూ మాలిక్ ను పక్కనే ఉంచుకుంటున్నారు.

ఇప్పటివరకు తన కూతురును బయట ప్రపంచానికి పెద్దగా పరిచయం చేయలేదు రోజా. కానీ ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా తన పక్కనే కుమార్తెను ఉంచుకుంటూ ప్రతి ఫోటో ఫ్రేమ్ లోనూ ఆమె కనిపించేలా చేయటం విశేషం. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం.. తన కుమార్తెను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని రోజా భావిస్తున్నారని.. అందులో భాగంగానే ఆమె ఇలా చేస్తున్నారని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం అలాంటి అలాంటివేవి లేవని చెబుతున్నారు. ఏది ఏమైనా.. కుమార్తె కెరీర్ విషయంలో రోజా తగిన కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Loading...