Friday, April 26, 2024
- Advertisement -

ప్రభాస్ కు ఊహించని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సమంత..!

- Advertisement -

అక్టోబ‌ర్ 23 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు. డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేం రాథాకృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ ప్రకటన ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభాస్ మూవీ టైటిల్ పై ఇంకా క్లారిటీ రాకముందే సమంత ఆ టైటిల్ ను లాగేసుకుని కొద్దిగా మార్చి పెట్టేసుకుందని అంటున్నారు.

గత కొత్తకాలం నుంచి.. ప్రభాస్, రాథాకృష్ణల మూవీకి ’జాన్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు శర్వానంద్, సమంత జంటగా 96 మూవీ రీమేక్ లో నటిస్తున్నారు. ఓ సినిమాకి ’జాను’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఇప్పుడు రిజిస్టర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అవుతే ప్రభాస్ తాజా మూవీ టైటిల్ పరిస్థితి ఏమింటి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ గందరగోళం పడుతున్నారు.

నిజానికి సమంత అందరి టాప్ హీరోలతో నటించినా.. ప్రభాస్ తో మాత్రం ఇప్పటివరకు చేయలేదు. ప్రభాస్ తో చేయాలని ఉందని సమంత తన కోరికను ఓపెన్ గా చెప్పినప్పటికి ప్రభాస్ పట్టుంచుకోలేదు. దాంతో ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని సమంత ప్రభాస్ టైటిల్ ను కబ్జా చేసి.. ప్రభాస్ బర్త్ డేకి గిఫ్ట్ ఇచ్చిందా అని సోషల్ మీడియాలో జోక్స్ వేసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -