అఖిల్ తో పెళ్లి కావాలంట.. విష్ణుప్రియ కోరిక.. రివీల్ చేసిన శ్రీముఖి..!

1153
sreemukhi revealed the secrets of vishnu priyas tattoo
sreemukhi revealed the secrets of vishnu priyas tattoo

అక్కినేని హీరో అఖిల్ అంటే ఆ యాంకర్ కు పిచ్చి ప్రేమట. అతను పేరును కూడా టాటుగా వేయించుకుంది. ఎవరా యాంకర్ అనుకుంటున్నారా ? ఆమె ఎవరో కాదు.. పోవే పోరా షోతో మంచి పాపులరిటీ తెచ్చుకున్న విష్ణుప్రియ. ఈమె షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పేరు తెచ్చుకుని యాంకర్ గా మారింది. ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ హాట్ యోగా వీడియోలు పోస్ట్ చేస్తూ కుర్రాల మతి పోగొడుతోంది.

ఆ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి, విష్ణుప్రియా మంచి ఫ్రెండ్స్. ఇటీవల కాలంలో వీళ్ళిద్దరూ తెగ తిరుగుతున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను కూడా వారు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఝాన్సీ హోస్ట్ చేస్తున్న ఓ షోలో వీళ్ళు సందడి చేశారు. ఇందులో భాగంగా.. ’విష్ణుప్రియకు సంబంధించి ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ను’ రివీల్ చెయ్యాలని యాంకర్ ఝాన్సీ.. శ్రీముఖిని కోరింది. అంతే ఇక శ్రీముఖి వెంటనే సీక్రెట్ ను బయటపెట్టింది.

హీరో అక్కినేని అఖిల్ అంటే యాంకర్ విష్ణుప్రియకు చాలా ఇష్టమని.. అతను ఒప్పుకుంటే ’పెళ్లి కూడా చేసుకునేంత ఇష్టమని’ చెప్పింది. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై… ఏదైనా వరం కోరుకోమని విష్ణుప్రియను అడిగితే.. ‘నాకు అఖిల్ తో పెళ్లి చెయ్యమని అడుగుతుందని…. తన చేతిపై అఖిల్ పేరుని టాటూగా వేయించుకుందని’ శ్రీముఖి చెప్పుకొచ్చింది. ‘ఈ విషయాన్ని ‘బిగ్ బాస్3′ లో ఉన్నప్పుడు నాగార్జున గారికి చెబుదాం అనుకున్నాను.. కానీ కుదర్లేదు’ అని కూడా శ్రీముఖి చెప్పుకొచ్చింది.

ఈసారి ‘బిగ్ బాస్-4’లో వెళ్లేది ఈ కపులే..?

రష్మీని వదిలేసి వర్షిణితో రొమాన్స్ చేస్తున్న సుధీర్..!

బిగ్ బాస్ 4 రాబోతుంది.. పాల్గోనే 15 మంది సెలబ్రిటీలు వీరే..!

నితిన్ పెళ్లికి పవన్ వెళ్లొద్దు అంటున్న అభిమానులు.. కారణం ?

Loading...