Friday, April 26, 2024
- Advertisement -

లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నా : శ్రీరామోజు సునిశిత్

- Advertisement -

కొందరు పబ్లిసిటీ కోసం ఇష్టానుసారంగా మాట్లేడుస్తున్నారు. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి తాజాగా ఇతను హీరోయిన్ లావణ్య త్రిపాఠితో పెళ్లైపోయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా ‘లావణ్య త్రిపాఠి.. అదేనండి సినిమా హీరోయిన్‌ని మా ఇంటి దగ్గర టెంపుల్‌లోకి తీసుకుని వెళ్లి మ్యారేజ్ చేసేసుకున్నా. సీక్రెట్ లవ్ మ్యారేజ్ అండి మాది.. 2015లోనే పెళ్లి చేసుకున్నా.

ఫొటోలు వీడియోలు ఏమీ బయటకు రాలేదు కాని.. అప్పట్లో ఓ మీడియా ఛానల్ వాళ్లు ఇచ్చారు.. ఏ ఛానల్ అన్నది నేను చెప్పను కాని మా పెళ్లి ఫొటోలను టెలికాస్ట్ చేశారు” అంటూ చెప్పాడు. ఇక పెళ్లి ఫోటోలేవు పోయినవి. నాకు లావణ్యకు గొడవ జరిగింది. అందుకే ఫొటోలు అన్ని డిలీట్ చేశానని చెప్పాడు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు కలిసి ఉన్నామని.. మా ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు కాని.. నన్ను చూసి లావణ్య ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారని.. లావణ్య వాళ్ల ఫాదర్ ఏది చెప్తే అది చేస్తుంది కాబట్టి.. ఆయన మా పెళ్లికి ఒప్పుకోవడంతో అలా పెళ్లి జరిగిపోయిందని.. తర్వాత చిన్న చిన్న గొడవలు రావడంతో విడిపోయాం” అని ఓ కథ చెప్పుకొచ్చాడు.

సుకుమార్ నేనొక్కడినే లో ముందుగా తననే హీరోగా ఎంపిక చేశారని.. షూటింగ్ కూడా చేసేశారని.. తర్వాత కొన్ని రోజులకు ఏమైందో ఏమో కానీ నా ప్లేస్‌లో మహేష్ బాబుని తీసుకున్నారు చెప్పాడు. నాన్నకు ప్రేమతో సినిమా కోసం కూడా తననే సెలక్ట్ చేశారని.. కానీ డాన్స్ సరిగ్గా చేయకపోవడంతో ఎన్టీఆర్ ను హీరోగా తీసుకున్నారని చెప్పాడు.

బలుపు మూవీ కోసం ముందే తననే అడిగారని.. కానీ రవితేజ 45 లక్షలు తీసుకుని తప్పుకో అని ఆఫర్ చేశాడని చెప్పాడు. అంతేకాకుండా బాహుబలి సినిమాలో ఓ పాపులర్ సాంగ్ పాడానని తన పేరు వేయలేదంటున్నాడు. ఇలా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలపై కూడా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నాడు శ్రీరామోజు సునిశిత్. ఇతనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజలు తిట్టిపోస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -