హాస్పిటల్లో జాయిన్ అయిన సునీల్… ఏమైంది ?

1293
tollywood comedian sunil hospitalized
tollywood comedian sunil hospitalized

టాలీవుడ్ లో కమెడియన్ గా రాణించి ఎన్నో సినిమాలో నటించాడు సునీల్. ఆ తర్వాత హీరోగా మారి కొన్ని సినిమాలు చేశాడు. మొదట్లో సక్సెస్ అయినప్పటికి.. తర్వాత వరస ప్లాప్స్ చూశాడు. దాంతో హీరోగా సినిమాలు చేయడం మానేసి మళ్లీ కమెడియన్ గా చేస్తున్నాడు.

ఇటివలే వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం సునిల్ కనిపించాడు. రవితేజ ‘డిస్కో రాజా’లో కీలకపాత్ర పోషించారు. అయితే గత కొన్ని రోజులుగా సునీల్ జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన ఎక్కువగా యాంటిబయోటిక్ మాత్రలు వేసుకోవడంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చింది. అయితే బుధవారం రాత్రి ఆయనకు వ్యాధి తీవ్రత పెరగడంతో హుటా హుటిన గచ్చిబౌలి లోని ఏఐజీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.

పరీక్షించిన డాక్టర్లు ఆయన యాంటిబయోటిక్ మాత్రలు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, సైనస్‌, ఇన్ఫెక్షన్‌ వచ్చినట్టు గుర్తించారు. దీంతో సునీల్ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే రాత్రి నుండి వైద్యం అందించడంతో సునీల్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని ప్రమాదం ఏమీ లేదని తెలుస్తోంది.

Loading...