Friday, April 26, 2024
- Advertisement -

ఫారెన్ అమ్మాయితో డేటింగ్ చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోగా మారాడు విజ‌య్ దేవ‌రకొండ. ఈసినిమా త‌రువాత మ‌నోడికి యూత్‌లో బాగా క్రేజ్ ఏర్ప‌డింది.విజ‌య్ త‌రువాత న‌టించే సినిమాల‌పై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి.తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గీతా గోవిందం సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ హిట్‌గా నిలిచింది.ఇక విజ‌య్ నటించిన నోటా సినిమా విడుద‌ల‌కు రెడీగా ఉంది.ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కు సూప‌ర్ రెస్ప‌న్స్ వ‌చ్చింది.సినిమాలు వ‌ర‌కు బాగానే ఉన్న విజ‌య్ దేవర‌కొండ ప్ర‌స్తుతం ఓ ఫారెన్ అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నాడ‌ని తెలుస్తుంది,ఆ అమ్మాయితో చ‌ట్ట‌ల్ ప‌ట్టాల్ వేసుకుని తిరుగుతున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ వార్త‌ల‌ను నిజం చేస్తు వీరిద్ద‌రు క‌లిసి ఉన్న కొన్ని ఫోటోలో సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇచ్చాయి.ఈ ఫొటోల్లో విజయ్ ఏకంగా ఆ అమ్మాయిని ముద్దు పెడుతూ కనిపించడంతో టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ క్లోజ్ గా తీసుకున్న సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్లియర్ గా ఈ జంట సెల్ఫీలు తీసుకున్నట్లు తెలుస్తోంది.మ‌రి దీనిపై విజ‌య్ దేవ‌ర‌కొండ ఏం స‌మాధానం చెబుతాడో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -