Saturday, April 27, 2024
- Advertisement -

వెంకటేష్ కూతురును అఖిల్ పెళ్లి చేసుకుంటాడా..?

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కుమారుడు.. అక్కినేని అఖిల్ కు ఇప్పుడు మరొ స్టార్ హీరో వెంకటేష్ కుమార్తెతో పెళ్లి జరగనుందా.. అంటే అవుననే మాట ఇప్పుడు సినీ పరిశ్రమలో వినిపిస్తోంది. గత డిసెంబర్ లో ప్రముఖ వ్యాపరవెత్త మనవరాలు అయిన శ్రియ భూపాల్ తో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఆ తర్వాత వారి మధ్య ఏవో గొడవల వల్ల వారి పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అఖిల్ తన పెళ్లి గురించి పక్కన పెట్టి.. తన రెండో సినిమాపై దృష్టిపెట్టాడు. ఈ నెపథ్యంలో అతని కంటే వెనుక పెళ్లి చేసుకుంటారని ప్రకటించిన నాగచైతన్య, సమంత పెళ్లి దగ్గరపడితోంది. ఈ క్రమంలో అఖిల్ కూడా పెళ్లి చేసేయానున్నారని.. వెంకటేష్ కుమార్తెను అఖిల్ కు జోడిగా ఎంచుకున్నారని.. ఈ మెరకు వెంకటేష్ తో నాగార్జున మాట్లాడారని, గతంలో ఉన్న బంధుత్వం కారణంగా ఈ పెళ్లికి ఆయన కూడా అంగీకరించారని సోషల్ మీడియాలో న్యూస్ ఒకటి హల్ చల్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంతవరకు ఉందో తెలియలంటే నాగార్జున కానీ వెంకటేష్ కానీ స్పందిస్తే కానీ నిర్ధారణ కాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -