Friday, April 26, 2024
- Advertisement -

బిగ్ బాస్ 4 సీజన్ కు హోస్ట్ గా మహేష్ బాబు..?

- Advertisement -

బిగ్ బాసు షోకి సంబంధించి ఇప్పటికే మూడు సీజన్లు తెలుగులో కంప్లీట్ అయ్యాయి. అయితే త్వరలో బిగ్ బాస్ 4 సీజన్ ప్రారంభించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. దాంతో సీజన్ 4 కు ఎవరు హోస్ట్ గా ఉండబోతున్నారనే విషయంపై సోషల్ మీడియాలో రకరకల వార్తలు వస్తున్నాయి. మొదటి సీజన్ లో ఎన్టీఆర్.. రెండవ సీజన్లో నాని.. మూడవ సీజన్లో నాగార్జున హోస్టులుగా వ్యవహరించారు.

అయితే ఈ సారి నాలుగో సీజన్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది మహేష్ బాబు అభిమానులకు కిక్కించే న్యూసే. ఎందుకంటే మహేష్ కామెడీ చేస్తే ఎలాగుంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కలేజా, సరిలేరు మూవీలో కామెడీతో అదరగొట్టారు. ఇక బిగ్ బాస్ సీజన్ అంటే టైమింగ్ ఉండే పంచులు వేయాలి. సో హోస్ట్ గా చేయడంలో మహేష్ సరిపోతారని ఇప్పటికే సోషల్ మీడీయాలో మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మరికొందరు అయితే మహేష్ రిజర్వుడుగా ఉండే వ్యక్తి కావడంతో ఇలాంటి షోలకు న్యాయం చేయకపోవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కా నాగార్జునే మళ్లీ బిగ్ బాస్ 4 వ సీజన్ కు హోస్ట్ గా ఉంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. అలానే మెగాస్టార్ చిరు కూడా హోస్ట్ చేసే చాన్స్ ఉందని అంటున్నారు. ఏది ఏమైన మహేష్ లాంటీ హీరో ఫస్ట్ టైం బుల్లితెరపై హోస్ట్ చేస్తే చూడాలన్నది చాలా మంది కోరిక. మరి అది నెరవేరుతుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -