Wednesday, May 8, 2024
- Advertisement -

నెక్ట్స్ బాబు ఇల్లే.. తూచ్ అది బాబు ఇల్లు కాదట..

- Advertisement -

జగన్ ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది. అన్నట్టే సీఎం జగన్ ప్రజావేదికను నిన్న రాత్రి నుంచి కూలగొట్టడం మొదలు పెట్టించాడు. అందులోని ఎలక్ట్రానిక్, ఫర్నిచర్ సామన్లను అన్నింటిని తరలించిన సిబ్బంది ఇప్పుడు బుల్డోజర్లతో ప్రజావేదిక ను కూల్చే పనికి సిద్దమయ్యారు.

కాగా విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు ఈరోజు తాజాగా అమరావతిలోని ఉండవల్లిలో ఉన్న తన నివాసానికి చేరుకొని టీడీపీ నాయకులతో చర్చల్లో మునిగిపోయారు. జగన్ ప్రజావేదికను కూల్చడంపై ఎలా స్పందించాలి.? ఎలా ఎదుర్కోవాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది.

ఇక చంద్రబాబు నివాసం జగన్ ప్రభుత్వం కూలుస్తున్న ప్రజావేదిక పక్కనే ఉంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశాలకు దీన్ని కట్టుకున్నారు.

తాజాగా ప్రజావేదిక తర్వాత టార్గెట్ చంద్రబాబు ఇళ్లేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు ఉంటున్న ఎస్టేట్ పక్కనే ఓ రైతు భూమిని బెదిరించి తీసుకొని ఈ ప్రజావేదిక కట్టారని.. ఇప్పుడు ఆ లాక్కున్న భూములన్నింటిని వాటికి తిరిగి ఇచ్చేస్తామని ఆళ్ల బుధవారం ప్రజావేదికను కూల్చడాన్ని పర్యవేక్షిస్తూ మీడియాతో చెప్పుకొచ్చారు.

ఇక టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ‘ప్రజావేదిక పక్కనున్నది చంద్రబాబు సొంతిళ్లు కాదని.. అది లింగమనేని గెస్ట్ హౌస్ అని.. దాన్ని అద్దెకు తీసుకొని ఉంటున్నాడని వివరణ ఇచ్చారు.

ఇలా ప్రజావేదిక కూల్చివేత చుట్టు ఇప్పుడు అమరావతిలో రాజకీయం రంజుగా సాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -