Friday, April 26, 2024
- Advertisement -

చంద్ర‌బాబు ఢిల్లీ టూర్‌పై విజ‌య‌సాయి సెటైర్స్‌..

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఢిల్లీటూర్‌కు బ‌య‌లు దేరారు. విజ‌య‌వాడ గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంనుంచి బాబు ఢిల్లీ వెల్లారు. ఈ రోజు చంద్రబాబునాయుడు ఢిల్లీలో మ‌ధ్యాహ్నం 3.30 గంటలకు బీజేపీయేతర పార్టీలతో న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. మహాకూటమి భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

మహాకూటమి భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీకి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎస్పీ అధినేత అఖిలేష్ సింగ్ యాదవ్, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, సీఐపీ నేత సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఎం నేత సీతారాం ఏచూరి, డీఎంకే అధినేత స్టాలిన్ తదితరులు హాజరుకానున్నారు.

ఇదాలా ఉంటే బాబు ఢిల్లీటూర్‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సెటైర్లు వేశారు. భాజాపా యోత‌ర పార్టీల నేత‌ల‌తో స‌మావేశంపై విజయసాయి రెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. గతంలో కేంద్రంపై పోరాటం చేస్తానని వెళ్లిన చంద్రబాబు ఢిల్లీలో మోదీతో నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అలాగే చంద్రబాబు పార్లమెంటు మెట్లకు దండం పెడుతున్న మరో ఫొటోను పంచుకున్నారు. ఈ మెమెకు ‘గతంలో ఢీ కొట్టినప్పుడు మనం చూసిన భీకర దృశ్యాలు’ అంటూ వెటకారంగా క్యాప్షన్ ఇచ్చారు.

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు కూడా బీజేపీయేతర పార్టీలతో కూటమిపై కూడా ప్ర‌భావాన్ని చూప‌నున్నాయి. ఒక వేల ఈ ఎన్నిక‌ల్లో భాజాపా మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌స్తే మాత్రం కూట‌మిపై అంత సానుకూల ప్రభావం ఉండకపోవచ్చే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీయేతర పార్టీలు విజయం సాధిస్తే కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలకు మరింత ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -