Saturday, April 27, 2024
- Advertisement -

మాజీ సీఎం బాబు బ్రేక్ వేశారు…కొత్త సీఎం జ‌గ‌న్ ప‌చ్చ‌జెండా ఊపారు

- Advertisement -

న‌వ్యాంధ్ర‌సీఎంగా వైఎస్ జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నె దూకుడు పెంచారు. ప‌రిపాల‌న‌లో స‌మూల మార్పులు తీసుకొచ్చేందుకు శ్రాకారం చుట్టారు. టీడీపీ ప్ర‌భుత్వంలో బాబుకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన అధికారులంద‌రిపై బ‌దిలీ వేటు వేసి కొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. గ‌తంలో బాబు తీసుకున్న అనేక వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌పై జ‌గ‌న్ స‌మీక్షించ‌నున్నారు.

దీనిలో భాగంగా రాష్ట్రంలోకి సీబీఐ ఆర‌కుండా మాజీ సీఎం చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యానికి జ‌గ‌న్ ప‌చ్చ జెండా ఊపారు. కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ దాడులకు చంద్రబాబు నానాయాగి చేశారు. కేంద్రం కావాల‌నె క‌క్ష‌సాధింపుల‌చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని గ‌గ్గోలు పెట్టారు. ఏపీలో సీబీఐ ఎంట్రీకి అనుమతి ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వాల కన్సెంట్‌ లేకుండా ఆయా రాష్ట్రాల్లోకి అడుగుపెట్టే అధికారంలేని సీబీఐకు ఏపీ ప్రభుత్వం బ్రేక్ వేసింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టసవరణను జగన్‌ సర్కారు రద్దు చేయబోతోంది. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే సీబీఐ దేశంలోని ఏరాష్ట్రంలో అయినా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.

కేంద్ర ప్రభుత్వం సీబీఐని రాజకీయ కక్ష సాధించేందుకు వినియోగిస్తోందన్న ఆరోపణలతో గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం కన్సెంట్‌ ఇవ్వలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో, సీబీఐ ప్రవేశానికి పాత మార్గాన్నే చూపబోతోంది. మ‌రి ఇప్పుడు మాజీ సీఎం చంద్ర‌బాబు ఏంచేస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -