Saturday, April 27, 2024
- Advertisement -

టీడీపీ నుంచి ప్ర‌జావేదిక‌ను స్వాధీనం చేసుకున్న ప్ర‌భుత్వం..

- Advertisement -

ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవ‌డంతో ఎప్పుడూ లేనన్ని గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు చంద్ర‌బాబు.ఫిరాయింపుల‌ను య‌దేచ్చ‌గా ప్రోత్స‌హించిన బాబు అదే ఫిరాయింపులు నిద్ర‌లేకుండా చేస్తున్నాయి. కేంద్రంలో భాజాపా …ఇటు రాష్ట్రంలో జ‌గ‌న్ ఇద్ద‌రూ వాయించేస్తుండ‌టంతో బాబు ప‌రిస్థితి కుడితిలో ప‌డిన ఎలుక‌లాగా త‌యార‌య్యింది.ఇప్ప‌టికే న‌లుగురు ఎంపీలు భాజాపాలో చేరి షాక్ ఇవ్వ‌గా తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రో భారీ షాక్ ఇచ్చింది.

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం సమీపంలో ఉండే ప్రజావేదిక క్యాంప్ కార్యాలయాన్ని ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ నెల 24న జరగబోయే కలెక్టర్ల సదస్సును ప్రజావేదికలో నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం… ఇందుకోసం ప్రజావేదికను స్వాధీనం చేసుకోవాలని డిసైడయ్యింది. శుక్రవారం మధ్యాహ్నాం ప్రజావేదికను స్వాధీనం చేసుకున్న సీఆర్డీఏ, గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు ప్రజావేదికను పరిశీలించారు.

అనంత‌రం చంద్రబాబు పీఎస్‌కి ఫోన్ చేసిన అధికారులు జావేదికలో ఉన్న టీడీపీ సామాగ్రిని తరలించాలని ఆదేశించారు. నిజానికి ఉండవల్లిలోని తన నివాసం సమీపంలో ఉండే ప్రజావేదిక ప్రాంగణాన్ని తనకు కేటాయించిన టీడీపీ అధినేత చంద్రబాబు గతంలోనే ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. అయితే చంద్రబాబు లేఖకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈలోపు ఏపీ ప్రభుత్వం ప్రజావేదిక ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించడం టీడీపీ వర్గాలకు షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం అమరావతి తరలివెళ్లిన తరువాత ప్రభుత్వ సమావేశాలు, సదస్సుల కోసం రూ. 10 కోట్ల ఖర్చుతో సీఆర్డీఏ ప్రజావేదికను నిర్మించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -