Friday, April 26, 2024
- Advertisement -

సీబీఐ వివాదంలో కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌….

- Advertisement -

సీబీఐ వ‌ర్సెస్ సీబీఐ వివాదంలో కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఆలోక్‌వర్మను సెలవుపై కేంద్రం పంపడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆలోక్ వర్మను సెలవు పై పంపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ …తిరిగి ఆలోక్ వర్మకు సీబీఐ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్థానాల మధ్య నెలకొన్న విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో, కేంద్రం, వర్మపై ఒత్తిడి తెచ్చి సెలవు పెట్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే అలోక్ వర్మ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సెలెక్ట్ ప్యానల్ పంపాలని సూచించింది. ఉన్నతస్థాయి ఎంపిక కమిటీ అభిప్రాయం, ముందస్తు అనుమతి తీసుకోకుండా సీబీఐ డైరెక్టర్ అధికారాలు, విధులను అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది.

సీబీఐ అనేది స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థ అని, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నందున రాజకీయ పక్షాలు జోక్యం చేసుకోకూడదని న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఉన్నతస్థాయి ఎంపిక కమిటీ అభిప్రాయం, ముందస్తు అనుమతి తీసుకోకుండా సీబీఐ డైరెక్టర్ అధికారాలు, విధులను అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -